ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వర్మకి మెగా కాంపౌండ్ అంటే అస్సలు గిట్టదు. చిరంజీవికి వీరాభిమానిని.. పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానిని అని పైకి చెప్పినా, ఛాన్స్ తీసుకుని మరీ మెగా కాంపౌండ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు రామ్‌గోపాల్‌వర్మ. పొరపాటున వర్మ, మెగా హీరోల్ని పొగిడాడంటే వెనకాల ఫిట్టింగ్‌కి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లే లెక్క. ఇది వర్మ గురించి మెగా అభిమానులు తరచూ చెప్పే మాట.
కానీ వర్మ ఇంకోలా చెబుతుంటాడు. నిజాలే మాట్లాడతానంటాడు. మెగా కాంపౌండ్‌పై అభిమానంతోనే అంతా చేస్తున్నానంటాడు. సరే ఆ సంగతి పక్కన పెట్టేద్దాం. అసలు విషయానికి వస్తే, 'వినయ విధేయ రామ' ట్రైలర్‌పై తాజాగా వర్మ ప్రశంసలు గుప్పించారు. 'కేజీఎఫ్' సినిమాని తలపిస్తోందన్నాడు. 'గోల్డ్, డైమండ్స్ కలిస్తే ఎలా ఉంటుందో.. అలా ఉంది ఈ ట్రైలర్..' అని చెప్పాడు.
అయితే బాలీవుడ్‌లో చరణ్ చేసిన 'జంజీర్' సినిమాని మర్చిపోయి దీన్ని తొలి బాలీవుడ్ సినిమాగా చరణ్ భావిస్తే మంచిదని చరణ్‌కి సలహా ఇచ్చాడు. నిజానికి కేజీఎఫ్' ఓ సాదా సీదా మాస్ ఎంటర్‌టైనర్. వసూళ్లు మాత్రం అదరగొట్టేస్తోంది. చిత్రంగా బాలీవుడ్‌లోనూ దుమ్ము లేపేస్తోంది. అలాగే 'వినయ విధేయ రామ'లో కూడా మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా హెవీగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ సినిమా రిలీజయ్యాక వర్మ నుండి ఇంకో ట్వీట్ రాదు కదా. వచ్చినా అది చరణ్‌కి నెగిటివ్‌గా ఉండదు కదా.