కేఏ పాల్‌కి దిమ్మ తిరిగే ట్వీటేసిన వర్మ.!

మరిన్ని వార్తలు

రామ్‌ గోపాల్‌ వర్మ గురించి కేఏ పాల్‌ ట్వీట్‌ వైరల్‌గా మారింది. వర్మ ఏంటీ.? పాల్‌ కాళ్లు పట్టుకోవడమేంటీ.? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కట్టుకథలు చెప్పడం, పబ్లిసిటీ స్టంట్స్‌ చేయడంలో వర్మనే మించిపోతారు పాల్‌. అందులో భాగంగానే పాల్‌ తెలివిగా ట్వీటేసినట్లున్నాడు. దానికి వర్మ కౌంటర్‌ కూడా గట్టిగానే పడింది. కాళ్లు పట్టుకుని కిందకి లాగేద్దాం.

 

బుర్ర నేలకు తగిలి మైండ్‌ సెట్టవుతుందేమో అనుకున్నాను అంటూ ఫన్నీగా ట్వీటేశాడు వర్మ. ట్రంప్‌తో సమావేశం అంటాడు. అమితాబ్‌బచ్చన్‌ నా భక్తుడంటాడు. పాల్‌ చెప్పే కహానీలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడైనా పాల్‌ మాటలు చెల్లుతాయేయో. కానీ వర్మ దగ్గర కుదరవు. వర్మ నుండి కౌంటర్‌ వస్తుందనే తెలిసే పాల్‌ ఈ ట్వీట్‌ చేసి ఉంటాడు. తద్వారా పాల్‌కి కొద్దో గొప్పో పబ్లిసిటీ వచ్చింది.

 

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్‌ దగ్గరపడిన తరుణంలో కేఏ పాల్‌ ఏదో రకంగా పబ్లిసిటీ స్టంట్స్‌ చేస్తున్నారు. పాల్‌ అంటే ఎవరో చాలా మంది మర్చిపోయారు. అలాంటిది ఈ మధ్య ఎలక్షన్స్‌ పేరు చెప్పి మీడియా ముందుకొచ్చి ఉపన్యాసాలు చేస్తున్నారు. ఇక సంచలనాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రంతో బిజీగా ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS