ఇస్మార్ట్ రామ్.. గిఫ్టుతో ప‌డ‌గొట్టేశాడు

By iQlikMovies - February 05, 2019 - 11:45 AM IST

మరిన్ని వార్తలు

పూరి జ‌గ‌న్నాథ్ ఓ మ‌త్తు పానియం లాంటోడు. ఎవ‌రితో ప‌నిచేసినా వాళ్ల మ‌న‌సుల్ని లటుక్కున లాగేసుకుంటుంటాడు. అప్పుడెప్పుడో బండ్ల గ‌ణేష్ పూరికి ఓ ఖ‌రీదైన గిఫ్ట్ ఇచ్చాడు. ల‌క్ష‌లు ఖ‌రీదు చేసే లైట‌ర్‌ని బ‌హుమానంగా అందించాడు. ఎన్టీఆర్ కూడా టెంప‌ర్ స‌మ‌యంలో ఖ‌రీదైన వాచ్‌ని బ‌హుమ‌తిగా ఇచ్చాడ‌ని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు రామ్ కూడా పూరిని గిఫ్టుతో ప‌డ‌గొట్టేశాడు.

 

పూరి - రామ్ కాంబినేష‌న్ లో `ఇస్మార్ట్ శంక‌ర్‌` అనే ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. దీనికి పూరినే నిర్మాత‌. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ సంద‌ర్భంగా పూరికి రామ్ ఓ ఖ‌రీదైన కాఫీ డిప్ బ్యాగ్‌లను బ‌హుమ‌తిగా ఇచ్చాడు. ‘KOPI LUWAK’ అనే బ్రాండ్‌కి చెందిన కాఫీ అది. ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన కాఫీ ఇదేన‌ట‌ ఆ  కాఫీ తాగుతూ.. ఓ ఫొటోని పోస్ట్ చేశాడు పూరి.  మేలో ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఈ లోగా.. వీరిద్ద‌రి బాండింగ్ ఇంకెంత పెరుగుతుందో చూడాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS