'బాహుబలి' సినిమాలో 'శివగామి'గా రమ్యకృష్ణ పోషించిన పాత్ర సినిమాకి ఎంత బలాన్ని తెచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పాత్ర పేరు, పేరుకు తగ్గ హుందాతనం, రాజసం ఉట్టిపడేలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు రమ్యకృష్ణ. గతంలో ఎన్నో గ్లామరస్ పాత్రల్లో నటించిన రమ్యకృష్ణకు ఈ మధ్య కాలంలో అత్యంత పాపులారిటీ తెచ్చిన పాత్రలు 'బాహుబలి' సినిమాలో 'శివగామి' ఒకటి, 'సోగ్గాడే చిన్నినాయనా'లో సత్యభామ పాత్ర మరొకటి. ఈ రెండు పాత్రలూ ఒకదాన్ని మించి ఒకటి ఆమెలోని హుందాతనాన్ని బయటికి తెచ్చిన పాత్రలుగా చెప్పొచ్చు. ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అవి.
తాజాగా రమ్యకృష్ణ 'గ్యాంగ్' సినిమాలో నటించారు. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా గురించి చెబుతూ రమ్యకృష్ణ చాలా ఎగ్జైయిట్‌మెంట్ ఫీలయ్యారు. అంటే ఈ సినిమా పట్ల రమ్యకృష్ణ స్పెషల్ కేర్ తీసుకున్నారనే అనుకోవచ్చు. మామూలుగా రమ్యకృష్ణ తన సినిమా ప్రమోషన్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ 'గ్యాంగ్' విషయంలో ఆమెకు చాలా నమ్మకాలున్నాయట. ఇక సినిమా విషయానికి వస్తే, రమ్యకృష్ణ ఓ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు 'గ్యాంగ్'లో. ప్రోమోస్ చూస్తుంటే, రమ్యకృష్ణ పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. సూర్యతో పాటు రమ్యకృష్ణ పాత్ర కూడా బాగా ఎలివేట్ అయ్యేలా అనిపిస్తోంది.
అలాగే ఈ జనరేషన్ హీరోయిన్స్ లావణ్య త్రిపాఠి, కీర్తి సురేష్ వంటి ముద్దుగుమ్మలకు గ్లామర్‌లో గట్టి పోటీ ఇవ్వడమంటే, అది ఒక్క రమ్యకృష్ణకే చెల్లింది. అదీ రమ్యకృష్ణ గ్లామర్ ప్రత్యేకత. ఇన్ని స్పెషాలిటీస్‌తో మరోసారి రమ్యకృష్ణ తన పవర్‌ని చూపించేందుకు స్పెషల్ 'గ్యాంగ్'తో రెడీ అయిపోయారు.