37 టేకులు... రెండు రోజులు

By Gowthami - March 11, 2019 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

ర‌మ్య‌కృష్ణ‌... ఏ పాత్ర‌లో అయినా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల స‌మ‌ర్థురాలు. నీలాంబ‌రి, శివ‌గామి పాత్ర‌లు ర‌మ్య‌కృష్ణ న‌ట‌నా ప్రాభ‌వానికి ప్ర‌తీక‌లు. అలాంటి ర‌మ్య‌కృష్ణ ఓ సన్నివేశం చేయ‌డానికి చాలా ఇబ్బంది ప‌డాల్సివ‌చ్చింద‌ట‌. ఏకంగా 37 టేకులు తీసుకుంద‌ట‌. ఆ స‌న్నివేశం కోసం రెండు రోజులు శ్ర‌మించాల్సివ‌చ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని ర‌మ్య‌కృష్ణ స్వ‌యంగా చెప్పింది. త‌మిళంలో 'సూప‌ర్ డీల‌క్స్‌' అనే ఓ సినిమా తెర‌కెక్కుతోంది. స‌మంత‌, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. త్యాగ‌రాజ‌న్ ద‌ర్శ‌కుడు. ఇందులో ర‌మ్య‌కృష్ణ ఓ వేశ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది. 

 

ఓ స‌న్నివేశం కోసం 37 టేకులు తీసుకుంది. ఆ సీన్ పూర్త‌వ్వ‌డానికి రెండు రోజులు ప‌ట్టింది. ''ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు ఓ ఎత్తైతే.. ఈ పాత్ర మరో ఎత్తు. సినిమాలో నేను నటించాల్సిన ఓ సన్నివేశానికి ఏకంగా 37 టేక్‌లు తీసుకున్నా. ఆ సన్నివేశం పూర్తిచేయడానికి రెండు రోజులు పట్టింది. అది చూసి నాకంటే.. నా అసిస్టెంట్లు, సెట్‌లో ఉన్నవారే షాకయ్యారు.  కొన్ని పాత్రలను డబ్బు కోసం చేస్తాం. మరికొన్ని పాపులారిటీ కోసం, పేరు కోసం చేస్తాం. ఇంకొన్ని ఇష్టంతో చేస్తాం. ఈ సినిమాను మాత్రం నేను ఇష్టపడే చేశా'' అంటోంది ర‌మ్య‌. ఈనెల 29న ఈ చిత్రం విడుద‌ల అవుతోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS