మహేష్ బాబు - సుకుమార్ మధ్య మొదలైన `క్రియేటీవ్ డిఫరెన్సెస్` టాలీవుడ్ కి షాక్ ఇచ్చాయి. మహేష్‌తో సినిమా చేస్తున్నట్టే బిల్డప్ ఇచ్చి - అల్లు అర్జున్ క్యాంప్‌లో ప్రత్యక్షమయ్యాడు సుకుమార్. దాంతో షాక్ తిన్న మహేష్ వెంటనే ఓ ట్వీట్ వేసి - తన అభిమానుల్ని శాంతపరిచే ప్రయత్నం చేశాడు. ఈ ఎపిసోడ్ వెనుక ఉన్న అల్లు అరవింద్ సైతం.. నమ్రతని కలసి.. సర్ది చెప్పే ప్రయత్నం చేశాడని టాలీవుడ్‌లో చెవులు కొరుక్కున్నారు.
మహేష్ ట్వీట్ చేసినా, సోషల్ మీడియాలో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారినా ఏమాత్రం స్పందించని సుకుమార్ ఇప్పుడు మహేష్ దగ్గరకు వెళ్లాడు. సారీ కూడా చెప్పి వచ్చాడు. మహేష్ బాబు కొత్త సినిమా `మహర్షి` షూటింగ్ చెన్నయ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా చెన్నై వెళ్లిన సుకుమార్, మహేష్‌ని కలిసి `సారీ` చెప్పాడట.
తాను ఏ పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లాల్సివచ్చిందో మహేష్ కి వివరించాడట. దాంతో మహేష్ బాబు కూడా సుకుమార్‌ని అర్థం చేసుకున్నాడటని, ఇద్దరి మధ్య గ్యాప్ దూరమైందని టాక్ వినిపిస్తోంది. సో.. ఈ వివాదానికి పుల్ స్టాప్ పడిపోయినట్టే అనుకోవాలి. ఇప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో మళ్లీ వీరిద్దరూ కలసి పనిచేసే అవకాశాలు ఉన్నాయన్నమాట.