50 కోట్ల‌కు చేరువ‌లో ఎఫ్ 2

మరిన్ని వార్తలు

ఈ సంక్రాంతి విజేత‌గా నిలిచిన చిత్రం `ఎఫ్ 2`. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ క‌ల‌సి న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీసు ద‌గ్గ‌ర జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోంది. వెంకీ చేసిన అల్ల‌రి, పాట‌లు, అనిల్ రావిపూడి మ్యాజిక్ ఇవ‌న్నీ బాగా క‌లిసొచ్చాయి. పండ‌క్కి వచ్చిన మిగిలిన సినిమాలు టాక్ ప‌రంగా, వ‌సూళ్ల ప‌రంగా నిరాశ ప‌రిస్తే.. ఎఫ్ 2 రెండు ర‌కాలుగానూ విజృంభించింది. పండ‌గ హ‌డావుడి ముగిసినా... వ‌సూళ్లు ఏమాత్రం త‌గ్గ‌లేదు.

 

తొలి ఎనిమిది రోజుల్లోనూ రూ.39.70 కోట్లు అందుకుంది. నైజాంలో రూ.13.33 కోట్లు అందుకున్న ఈ సినిమా, సీడెడ్‌లో రూ.5 కోట్ల‌కు పైనే సాధించింది. విదేశాల్లో రూ.4.30 కోట్లు సంపాదించింది. వారంలోపే పెట్టిన పెట్టుబ‌డి తిరిగొచ్చేసింది. ఇక నుంచి వ‌చ్చిన ప్ర‌తీ రూపాయి లాభం క్రిందే లెక్క‌. ఈ వారం అఖిల్ సినిమా `మిస్ట‌ర్ మ‌జ్ను` విడుదల అవుతోంది. అది మిన‌హాయిస్తే.... ఎఫ్ 2కి పెద్ద‌గా పోటీలేదు. అంటే... ఈ వారం ముగిసేలోగా ఎఫ్ 2 రూ.50 కోట్ల మైలురాయిని చేరుకోవ‌డం ఖాయంలా క‌నిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS