ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో `వినయ విధేయ రామ` ఒకటి. చరణ్‌తో బోయపాటి చేసిన సినిమా ఇది. వీరిద్దరూ ఫామ్‌లో ఉన్నవారే. దానికి తోడు సంక్రాంతి బరిలో ఉన్న ఫుల్ మాస్ సినిమా ఇదే. అందుకే ఈ సినిమాపై చాలా అంచనాలు పెరిగాయి. అయితే... ఆ ఆశల్ని, అంచనాల్నీ అందుకోవడంలో వినయ విధేయ రామ పూర్తిగా విఫలమైంది. ఈ సినిమాతో అటు నిర్మాతలూ, ఇటు డిస్టిబ్యూటర్లూ బాగా నష్టపోయారు.
యూవీ క్రియేషన్స్ 'వినయ విధేయ రామ'పై భారీగా పెట్టుబడి పెట్టింది. కొన్ని ఏరియాల్ని కొనుగోలు చేసింది. ఈ సినిమాతో యూవీకి భారీ నష్టాలు ఎదురయ్యాయి. దాదాపుగా రూ.30 కోట్ల వరకూ పోయి ఉండొచ్చని ఓ అంచనా. అంతకు ముందు 'రోబో 2.ఓ'తో రూ.5 కోట్లు పోయాయి. అంటే రెండు సినిమాలకు రూ.35 కోట్ల నష్టమన్నమాట.
ప్రస్తుతం 'సాహో' చిత్ర నిర్మాణంతో బిజీగా ఉంది యూవీ క్రియేషన్స్. ఆ సినిమాపై రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టారు. ప్రభాస్‌సినిమా కాబట్టి, సాహోపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి కాబట్టి.. ఆ పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడం కష్టమేమీ కాదు. ఈ రెండు సినిమాలో పోయింది.. అక్కడే రాబట్టుకోవాలి మరి.