తెలుగు చిత్రసీమలో మెస్ట్ బ్యాచిలర్ లలో ఒకరు... రానా. ఈమధ్యే... తన ప్రేమ వ్యవహారం బయటపెట్టాడు. ఇంతలోనే నిశ్చితార్థం కూడా జరగబోతోంది. మిహీక బజాచ్తో రానాకొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఈమధ్యే ట్విట్టర్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఇరు కుటుంబాలు సైతం.. వీళ్ల ప్రేమకు పచ్చజెండా ఊపాయి. అందుకే డిసెంబరులో పెళ్లి చేయాలని నిర్ణయించారని సమాచారం.
ఈ రోజు సాయింత్రం హైదరాబాద్లో ని రామానాయుడు స్టూడిలోనే రానా-మిహీకాల నిశ్చితార్థం జరగబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నిశ్చితార్థానికి కేవలం అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. మీడియాకు సైతం ఆహ్వానం లేదు. అన్నట్టు మహీకది హైదరాబాదే. బంటీ బజాజ్, సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె మిహీకా బజాజ్. మిహీకా రానాకు సోషల్ మీడియాలో పరిచయం కాగా ఇటీవల తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.