బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'గల్లీబాయ్' సినిమాని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతన్న వేళ కొందరు యంగ్ హీరోల పేర్లు తెరపైకొచ్చాయి. వీరిలో సాయిధరమ్ తేజ్ ముందున్నాడు. అయితే వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా పట్ల ఆసక్తితో వున్నాడనే ప్రచారం జరుగుతోంది. లిస్ట్‌లో రానా పేరు కూడా వినిపించింది.
కానీ రానా దగ్గుబాటి 'నో' చెప్పేశాడు. తనను ఆ గాసిప్స్‌లో ఇరికించద్దంటూ సోషల్ మీడియాలో స్పందించాడు రానా. వాస్తవానికి 'గల్లీబాయ్' మరీ అంత గొప్ప సినిమా ఏమీ కాదు. ఓ మోస్తరు సినిమానేగానీ, కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యింది. నటీనటుల ప్రతిభకు తోడు, సినిమా రిలీజ్ టైమ్ బాగా కలిసొచ్చి గల్లీబాయ్ మంచి విజయాన్ని అందుకుంది బాలీవుడ్‌లో.
ఇదిలా వుంటే అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ పతాకంపై సాయిధరమ్‌తేజ్ హీరోగా 'గల్లీబాయ్'ని తెలుగులో తీయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే. ఈ వార్తలపై సాయిధరమ్ తేజ్ ఇంకా స్పందించలేదు. వరుణ్ కూడా పెదవి విప్పలేదు. ఈ మధ్య ఏ భాషలో సినిమా హిట్టయినా వెంటనే ఆ సినిమా రీమేక్ రైట్స్ గురించిన చర్చ జరుగుతోంది. సో, అలాగే 'గల్లీబాయ్' గురించీ చర్చ జరుగుతోందన్నమాట.