స్వీటీ కోసం రానా ష్‌..'సైలెన్స్‌'.?

By iQlikMovies - February 18, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

మాధవన్‌, అనుష్క ప్రధాన పాత్రల్లో 'సైలెన్స్‌' అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కాస్టింగ్‌ పరంగా ఇప్పటికే భారీగా రూపొందుతోంది. తెలుగమ్మాయి అంజలి, 'అర్జున్‌రెడ్డి' ఫేం షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పోరేషన్‌ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. ఇదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ. 

 

కాగా ఈ సినిమాకి మరో స్టార్‌ కాస్టింగ్‌ యాడ్‌ అయ్యిందంటూ గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. 'భళ్లాలదేవ' రానా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడనీ కోలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. కీలక పాత్రల కోసం రానా ఎప్పుడూ ముందుంటాడు. కథ నచ్చితే పాత్ర నిడివితో కూడా సంబంధం ఉండదు రానాకి. అన్నింటికీ మించి స్వీటీ బ్యూటీ అనుష్కతో రానాకి మంచి స్నేహం ఉంది. 'బాహుబలి' చిత్రాలతో పాటు, 'రుద్రమదేవి' సినిమాలోనూ అనుష్కతో రానా నటించాడు. 

 

'సైజ్‌ జీరో' సినిమాలో జస్ట్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించాడంటే అది కూడా స్వీటీ కోసమే. మరోసారి స్వీటీ కోసం రానా గెస్ట్‌ రోల్‌కి ఓకే చేశాడనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ గుసగుసల్లో నిజమెంతో కానీ, ఒకవేళ రానా కూడా యాడ్‌ అయితే సినిమాకి ఖచ్చితంగా అది ప్లస్‌ అవుతుందనడం అతిశయోక్తి కాదు. ఈ సినిమాని ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించనున్నారట. ఈ సినిమా కోసమే స్వీటీ అనుష్క స్లిమ్‌గా మారి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now