నాని కొత్త సినిమా టైటిల్‌ ఏంటో తెలుసా.?

మరిన్ని వార్తలు

ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉండే నాని 'కృష్ణార్జున యుద్ధం' ఫెయిల్యూర్‌తో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. గతేడాది 'దేవదాస్‌' సినిమాతో ఫర్వాలేదనిపించినా, నాని రేంజ్‌ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. త్వరలో 'జెర్సీ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా సంగతి అటుంచితే, విక్రమ్‌ కుమార్‌తో నాని చేయబోతున్న మూవీ ఇటీవలే లాంఛ్‌ అయ్యింది. 

 

ఈ సినిమాలో నేచురల్‌ స్టార్‌ నానికి జోడీగా ఐదుగురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. వారి పేర్లు అధికారికంగా ప్రకటించలేదు. కానీ, రకుల్‌, సాయిపల్లవి, రష్మికా, కళ్యాణీ ప్రియదర్శిని.. ఇలా పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఈ సినిమా టైటిల్‌ విషయంలో విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారమ్‌ ప్రకారం 'గ్యాంగ్‌లీడర్‌' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కాక అచ్చమైన ఓ తెలుగు టైటిల్‌ని కూడా ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారట. 

 

అది క్లాసిక్‌ ఫ్లేవర్‌లో ఉండే టైటిల్‌ అనీ టాక్‌ వినిపిస్తోంది. పీరియాడికల్‌ మూవీగా ఈ సినిమా కథ ఉండబోతోందనీ మరోవైపు సమాచారమ్‌. నానిది డబుల్‌ రోల్‌ అనీ అంటున్నారు. ఏది ఏమైనా విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో నాని సినిమా అంటే అంచనాలు బాగానే ఉంటాయి. అవే అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌పై ఓ క్లారిటీ రానుందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS