భళా భళ్లాదేవ: గాసిప్స్‌కి ఇలా చెక్‌ పెట్టావన్న మాట!

మరిన్ని వార్తలు

భళ్లాలదేవగా బాహుబలి ప్రబాస్‌కి సమానమైన స్టార్‌డమ్‌ ఉంది రానాకి. తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ సినిమాలు చేసేస్తూ, ఎప్పుడూ బిజీగా ఉంటాడు రానా. అలాంటిది ఈ మధ్య రానా ఆరోగ్యంపై వస్తున్న గాచిప్స్‌ అన్నీ ఇన్నీ కావు. ఎంత క్లారిటీ ఇచ్చినా, అవి ఆగడం లేదు. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రానా, ఈ ఉత్త గాసిప్స్‌ స్వైర విహారం చేస్తున్నప్పటికీ, ఆయన పని ఆయన చేసుకు పోతూనే ఉన్నాడు.

 

సినిమాలకు తనదైన స్టైల్‌లో సోషల్‌ మీడియాలో ప్రమోట్‌ చేస్తున్నాడు. ఆయా సినిమాల టీజర్‌, ట్రైలర్స్‌ పట్ల తనదైన రెస్పాన్స్‌ ఇస్తూనే ఉన్నాడు. మరోవైపు మెల్లగా తాను ఒప్పుకున్న ప్రాజెక్టుల్ని కంప్లీట్‌ చేసేస్తున్నాడు కూడా. అయినా రానాపై వస్తున్న రూమర్స్‌కి ఆయన అభిమానులు ఆందోళన చెందుతూ, సోషల్‌ మీడియాలో 'వి వాంట్‌ రానా లేటెస్ట్‌ పిక్‌' అనే హ్యాష్‌ ట్యాగ్‌ని ట్రెండింగ్‌ చేశారు. దాంతో, రానా తన లేటెస్ట్‌ పిక్‌ని పోస్ట్‌ చేస్తూ, 'నా గురించి అడుగుతున్న వారందరికీ ఇదిగో నా లేటెస్ట్‌ పిక్‌.. లాస్‌ ఏంజెల్స్‌ నుండి..' అంటూ పోస్ట్‌ చేశాడు. కారులో రానా తీసుకున్న సెల్ఫీ పిక్‌ ఇది. గుబురు గడ్డంతో, కూలింగ్‌ గ్లాస్‌ పెట్టుకుని చిరునవ్వు చిందిస్తున్న ఫోటో అది.

 

రానా ప్రస్తుతం 'విరాటపర్వం' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ఓ పక్క జరుగుతూనే ఉంది. మరోపక్క 'హిరణ్యకశ్యప' సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు, బాలీవుడ్‌లో 'హాథీ మేరీ సాథీ', '1945' తదితర చిత్రాలు రానా లిస్టులో ఉన్నాయి. ఓ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌పై కూడా రానా సైన్‌ చేశాడనే సమాచారం ఉంది. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ రానా ఫ్యాన్స్‌ కోసం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం నిజంగా గొప్ప విషయం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS