ఆ కారు నాది కాదు మొర్రో అంటోన్న రష్మి

మరిన్ని వార్తలు

యాంకర్‌ రష్మి కారు యాక్సిడెంట్‌లో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా రష్మి స్పందించింది. రష్మీ కారనీ, అదీ కొత్త కారనీ.. వస్తున్న వార్తల్లో నిజం లేదని రష్మి ఖండించింది. వాస్తవానికి ఆ కారు తనది కాదంట. ఓ షూటింగ్‌ నిమిత్తం మేనేజ్‌మెంట్‌ వారు ప్రొవైడ్‌ చేసిన కారులో రష్మి ప్రయాణిస్తోందట అంతే. 

 

ఆ టైంలో అక్కడ చాలా చీకటిగా ఉండడంతో ఓ వ్యక్తి సడెన్‌గా వచ్చి కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందనీ రష్మి చెప్పింది. ఆ ఘటన జరిగిన వెంటనే తానే 108కి కాల్‌ చేసి అదే కారులో ఆసుపత్రిలో తరలించాననీ, పోలీసులు వచ్చేసరికి ఆలస్యం అవుతుందన్న కారణంగానే ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చామనీ రష్మి చెప్పింది. ఆ క్షణంలో కారు నడుపుతున్న డ్రైవర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. 

 

సో ఈ ఘటనకూ, రష్మికీ ఏ మాత్రం సంబంధం లేదని తేలిపోయింది. పాపం ఈ న్యూస్‌ బయటికి వచ్చినప్పటి నుండి సోషల్‌ మీడియాలో రష్మిని ట్రాల్‌ చేస్తున్నారు. కొత్త కారనీ, రష్మీ రేష్‌ డ్రైవ్‌ ఈ ప్రమాదానికి కారణమైందనీ అనవసరంగా నెగిటివ్‌ కామెంట్లు వస్తున్న తరుణంలో రష్మి అసలు జరిగిన విషయం ఇదీ అని తాజాగా సోషల్‌ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. ఇక ఇప్పటికైనా నెటిజన్లు రష్మిని ట్రాల్‌ చేయడం ఆపాలి మరి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS