నటి మాధవీలత గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ అభ్యర్దిగా బరిలోకి దిగుతోంది. హీరోయిన్‌గా 'నచ్చావులే' సినిమాతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన మాధవీలత ఆ తర్వాత 'స్నేహితుడు' తదితర చిత్రాల్లో నటించింది. కానీ ఈ మధ్య సినిమాలకు దూరమై, పోలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉంటోంది. సామాజిక పరమైన అంశాల పట్ల తనదైన శైలిలో స్పందిస్తూ, పలు ఛానెల్స్ నిర్వహించే డిబేట్స్‌లోనూ చురుగ్గా పాల్గొంటోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి మాధవీలత వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. కానీ బీజేపీలో చేరిన కారణంగా పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అయినా కానీ, మాధవీలతకు పవన్ అభిమానుల నుండి మద్దతు లభించే అవకాశం లేదు. ఒకవేళ జనసేనలో చేరి ఉంటే మాధవీలతకు విజయం దక్కేదేమో. కానీ ఆ పరిస్థితి లేదిప్పుడు. ఇదిలా ఉంటే, మొన్న జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో నటి రేష్మ ఇలాగే పోటీలోకి దిగారు. కానీ ఓటమి చవి చూశారు.
ఇప్పుడు మాధవీలత పరిస్థితి ఏమవుతుందో. ఇదిలా ఉంటే, శ్రీరెడ్డి గొడవ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా ఛాంబర్ ఎదుట ధర్నా చేసింది మాధవీలత. పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్‌గా ఇంటర్వ్యూలు ఇచ్చింది. అయినా కానీ పవన్ అభిమానులు మాధవీలతను సపోర్ట్ చేయడం వీలు కాదు. చూడాలి మరి మాధవీలత రాజకీయం ఎలా ఉండబోతోందో.!