కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ' సినిమాతో సంచలనమైన బ్యూటీ తెలుగులో ఇప్పుడు లక్కీ బ్యూటీ అయిపోయింది. వరుసగా 'ఛలో', 'గీత గోవింద' సినిమాలతో సంచలన విజయాలు అందుకుని, టాలీవుడ్‌లో అమ్మడు సంచలన హీరోయిన్ అయ్యింది.
అయితే ఈమె సంచలనం ఇంతటితో ఆగడం లేదు. ఆల్రెడీ కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో వివాహం నిశ్చయమైన రష్కిక వివాహం రద్దైన సంగతి తెలిసిందే. ఆ కోణంలో సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు, ట్రోలింగ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయమై రష్మికా తల్లి, రక్షిత్ శెట్టి క్లారిటీ ఇచ్చేశారు. అయితే రష్మికా నుండి అభిమానులు ఆశించే రీతిలో రెస్పాన్స్ రాలేదు. తాజాగా ఆమె కూడా స్పందించింది. ఈ విషయంలో మీకు సంజాయిషీ చెప్పుకోవల్సిన అవసరం నాకు లేదు.. అంటూ రష్మికా కొంచెం ఘాటుగా స్పందించింది.
ఇలా ట్రాలింగ్ చేసే వాళ్లందరికీ మొదటగా నమస్కారం తెలిపుతూ, తన స్టేట్‌మెంట్‌ని స్టార్ట్ చేసింది రష్మికా. తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న కథనాల కారణంగా తాను డిస్టర్బ్ అయ్యాననీ, దయచేసి ఇలాంటి ట్రాలింగ్స్ ఇంతటితో ఆపేయాలనీ కోరుతూనే, నాణానికి రెండు ముఖాలున్నట్లుగానే ప్రతీ కథలోనూ రెండు రూపాలుంటాయి.. అని చెప్పింది. అంటే అందరికీ తెలిసిన రూపం వేరు. తెలియని రూపం మరోటి ఉంది తన కథలో అని సింపుల్‌గా చెప్పకనే చెప్పి ముగించేసింది రష్మికా.
అంతేకాదు, ఈ గొడవల కారణంగా కన్నడలో సినిమాలు చేయడం మానేయననీ, ఇదివరకటిలానే అక్కడ కూడా సినిమాలు చేస్తానని చెప్పింది. త్వరలోనే 'దేవదాస్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది ముద్దుగుమ్మ రష్మికా