కడిగి పారేసి 'రెస్పెక్ట్‌' అంటావేంటి నిఖిల్‌

మరిన్ని వార్తలు

టీఆర్పీ రేటింగుల కోసం కక్కుర్తి పడే మీడియా.. అన్నట్లుగానే 'అర్జున్‌ సురవరం' అనే సినిమా ప్రోమో కన్పించింది. మీడియాపై సినిమాల్లో సెటైర్లు కొత్తేమీ కాదు. మీడియా కూడా ఇప్పుడు అలాగే వుందనుకోండి. అది వేరే సంగతి. కానీ, మీడియాతో సినీ జనాలకి అవసరాలెక్కువ. అందుకేనేమో, ప్రోమో ఎలా వున్నా హీరో నిఖిల్‌ మాత్రం, మీడియా పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సినిమాని జాగ్రత్తగా తెరకెక్కించామని ట్వీటేశాడు. 

 

సినిమాలో జర్నలిస్ట్‌గా నటిస్తోన్న నిఖిల్‌, ప్రోమోతో బాగానే ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ అదిరిపోయిందని ప్రోమోలో చూపించిన సీన్స్‌ని చూస్తే అర్థమవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, విజువల్స్‌ అన్నీ అద్భుతంగానే వున్నాయి. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి క్యూట్‌గా కనిపించింది.. ఇద్దరి మధ్యా రొమాంటిక్‌ సీన్స్‌ కూడా దర్శనమిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాల ప్రోమోస్‌తో కంపేర్‌ చేస్తే, 'అర్జున్‌ సురవరం' కొంత కొత్తగానే వుందని చెప్పొచ్చు. 

 

నిఖిల్‌కి ఈ తరహా సినిమాలు బాగా సూటవుతాయనీ, తన నటనతో ఆయా సినిమాల్ని ఈ యంగ్‌ హీరో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాడనీ చెప్పడానికి కొన్ని సాక్షాలూ వున్నాయి కాబట్టి, 'అర్జున్‌ సురవరం' సినిమా నిఖిల్‌కి మరో సూపర్‌ హిట్‌ ఇచ్చే అవకాశాలైతే లేకపోలేదు. తొలుత ఈ సినిమాకి 'ముద్ర' అని టైటిల్‌ అనుకోవడం, కొన్ని వివాదాలతో టైటిల్‌ మారి 'అర్జున్‌ సురవరం'గా ప్రేక్షకుల ముందుకు వస్తుండడం తెలిసిన సంగతులే. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS