కార్తీతో జోడీ కట్టనున్న కన్నడ కుట్టీ.!

మరిన్ని వార్తలు

తమిళ హీరో కార్తీకి జోడీగా ఓ సినిమాలో కన్నడ భామ రష్మికా మండన్నా ఎంపికైందని కోలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. ఇటీవల 'దేవ్‌' సినిమాతో కార్తి ఫ్యాన్స్‌ని నిరాశ పరిచాడు. తర్వాత 'రెమో' ఫేం భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో కార్తీ ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ సినిమా త్వరలో సెట్స్‌ మీదికెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సెన్సేషనల్‌ బ్యూటీ రష్మికా మండన్నాని ఎంచుకున్నారనీ తెలుస్తోంది. 

 

కన్నడలో 'కిర్రిక్‌ పార్టీ' సినిమాతో పాపులర్‌ అయిన రష్మికా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఆరాధ్య దేవత యిపోయింది. సోషల్‌ మీడియాలో రష్మికాకి ఉన్న క్రేజ్‌ ఈ జనరేషన్‌ హీరోయిన్స్‌లో మరో బ్యూటీకి లేదంటే అతిశయోక్తి కాదేమో. అలాగే తమిళంలోనూ రష్మికాకి మంచి క్రేజ్‌ ఉంది. అందుకే ఆ క్రేజ్‌ని వాడుకుందామనుకుంటున్నాడట కార్తీ, తన కొత్త సినిమాలో రష్మికాకి హీరోయిన్‌గా ఛాన్సివ్వాలనుకుంటున్నాడట. 

 

అయితే ఈ విషయమై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది. ఇకపోతే తెలుగులో రష్మికా చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. 'గీత గోవిందం' సంచలన విజయం తర్వాత విజయ్‌ దేవరకొండతో 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంలో నటిస్తోంది రష్మికా. యంగ్‌ హీరో నితిన్‌ నటిస్తున్న 'భీష్మ'లోనూ రష్మికానే హీరోయిన్‌. నాని హీరోగా రూపొందుతోన్న కొత్త మూవీ కోసం కూడా రష్మికా పేరు పరిశీలనలో ఉంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS