సెన్సేషనల్ బ్యూటీ రష్మికామండన్నా ప్రతీ చిన్న విషయానికీ సోషల్ మీడియాలో స్పందిస్తోంది. కౌంటర్స్ ఇవ్వడం మొదలు పెట్టింది. గాసిప్స్ వస్తూంటాయి. కానీ ప్రతీ గాసిప్‌కీ స్పందించాల్సిన అవసరం లేదు. మొన్న ఓ వ్యక్తి ట్విట్టర్‌లో రష్మికాను ప్రశ్నిస్తే ఆమె చాలా యాగీ చేసింది. 'నేను ఏదైనా చేస్తాను. ఏదైనా ఉంటే నాతో డైరెక్ట్‌గా తేల్చుకోండి. కానీ నా అభిమానుల జోలికి పోవద్దు..' అని ఆ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చింది రష్మికా.
'అసలు నిన్నెవరు ప్రశ్నించారు.? నువ్వెందుకు సీన్‌లోకి వచ్చావ్..? అని రష్మికాకు రివర్స్ కౌంటర్ ఇచ్చాడు ఆ వ్యక్తి. తాజాగా ఓ పత్రికలో రష్మికా కన్నడ సినీ పరిశ్రమను చిన్నచూపు చూస్తోందంటూ వార్త వస్తే, ఆ కథనంపైనా ఇలాగే విరుచుకుపడింది. 'నా మాతృభాష మీద నాకెందుకు చిన్న చూపుంటుంది. కన్నడ సినిమాల్ని నేనెప్పుడూ వద్దనుకోను..' అంటూ గుస్సా అయ్యింది.
సున్నితంగా ఖండించాల్సిన విషయాలకు ఇంత సీరియస్ అయిపోతూ రష్మికా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తోందంటూ నెటిజన్లు ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు. అందమైన గయ్యాలీ అంటూ కొందరు అభిమానులే రష్మికాను క్యూట్‌గా హెచ్చరిస్తున్నారు. చక్కనమ్మ ఏం చేసినా అందమే అని అన్నిసార్లూ అనుకోవడానికి వీల్లేదండోయ్. ఇకపోతే ప్రస్తుతం రష్మికా తెలుగులో 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు.