అనూహ్యంగా స్టార్‌డమ్ సంపాదించుకున్న అందాల భామ అనూ ఇమ్మాన్యుయేల్ గురించి టాలీవుడ్‌లో ఆశక్తికరమైన గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్యనే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో అవకాశమొస్తే ఆ ఆఫర్‌ని తిరస్కరించిందామె అంటూ ఓ గాసిప్ బయటికి వచ్చింది. మామూలుగా ఇలాంటి గాసిప్స్ వచ్చినప్పుడు ఖండిస్తుంటారు ఆయా సినీ ప్రముఖులు. కానీ అనూ ఇమ్మాన్యుయేల్ కామ్‌గా ఉండిపోయింది.
తాజాగా మరో బంపర్ ఆఫర్ అనూ ఇమ్మాన్యుయేల్ ముంగిట వాలిందట. అయితే దాన్ని కూడా ఆమె తిరస్కరించిందనీ ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇప్పుడామె సక్సెస్‌లో లేదు. మూడు ఫెయిల్యూర్స్‌తో అనూ కెరీర్ డీలా పడిపోయింది. మూడూ ప్రెస్టీజియస్ సినిమాలే. దాంతో అనూని దాదాపుగా తెలుగు సినిమా పక్కన పడేయాలి. కానీ బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఎగిరి గంతేయాల్సింది పోయి, వచ్చిన అవకాశాల్ని కాదనుకోవడమేంటీ.? ఈ ప్రశ్నకు సమాధానంగా వ్యక్తిగత కుటుంబ సమస్యల్ని కొందరు ప్రస్థావిస్తున్నారు. ఓ సినిమా ప్రమోషన్ కోసం అప్పట్లో అనూఇమ్మాన్యుయేల్ రాకపోవడం, వివాదాస్పదమైతే ఆ సమయంలో వ్యక్తిగత సమస్యలంటూ ఓ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ మలయాళీ భామ. ఆ సమస్యలు తీవ్రమయ్యాయా.? అందుకే అనూ ఇమ్మాన్యుయేల్ వస్తున్న పెద్ద పెద్ద ఛాన్స్‌ల్ని వద్దనుకుంటోందా.? వేచి చూడాల్సిందే.