ఇక్కడా రష్మికనే హైలైట్‌ చేశారుగా.!

మరిన్ని వార్తలు

‘భీష్మ’ నుండి మరో వీడియోని రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఆన్‌ సెట్స్‌ నుండి రిలీజ్‌ చేసిన ఈ మేకింగ్‌ వీడియో చాలా ప్లజెంట్‌గా కనిపిస్తోంది. షూటింగ్‌ సమయంలో సెట్స్‌లో జరిగిన సరదా సరదా సన్నివేశాల్ని ఈ వీడియోలో చూపించారు. ముఖ్యంగా రష్మిక ` నితిన్‌ మధ్య క్యూట్‌ క్యూట్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. రష్మిక అల్లరి చేష్టలు, నితిన్‌ రొమాంటిక్‌ చేష్టలు.. చూసేందుకు నవ్వులు పూయిస్తున్నాయి. డైరెక్టర్‌ వెంకీ కుడుములకీ రష్మికకీ మధ్య సన్నివేశాలు కూడా నవ్వులు తెప్పిస్తున్నాయి. మొదటి నుండీ ‘భీష్మ’ ప్రమోషన్స్‌ స్ట్రాటజీ ఇలాగే ఆకట్టుకుంటోంది.

 

ఇటీవల అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠపురములో..’ ప్రమోషన్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.ఆ రెస్పాన్స్ సినిమా సూపర్ హిట్ లో ఖచ్చితంగా కీ రోల్ పోషించింది అలాంటి కళే ఇప్పుడు ‘భీష్మ’ ప్రమోషన్స్‌లో కనిపిస్తోంది. ఐతే, టోటల్‌గా ప్రమోషన్స్‌ అన్నింట్లోనూ రష్మికనే హైలైట్‌ అవుతోంది. ఇక లేటెస్ట్‌ వీడియోలోనూ రష్మికే హైలైట్‌ అవుతుండడం ఫ్యాన్స్‌కి దిల్‌ ఖుషీ చేస్తోంది. ‘అల..’ టైమ్‌లో బుట్టబొమ్మ అంటూ పూజా హెగ్దేని ఆకాశానికెత్తేశారు.

 

అప్పుడు పూజాకి పోటీగా ‘సరిలేరు..’తో రష్మిక కూడా ఉన్నప్పటికీ ‘అల.’ సూపర్‌ హిట్‌తో రష్మిక రేస్‌లో సెకండ్‌ ప్లేస్‌కే పరిమితం కావల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరే. ‘భీష్మ’తో కలిసి రష్మిక సోలోగా వచ్చేస్తోంది. సో ఈ సోలో భామకిప్పుడు తిరుగే లేదు. ఆపే అడ్డే లేదు. సినిమా సక్సెస్‌ అయ్యిందా.. ఇక రష్మిక రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోతుందనడం అతిశయోక్తి కాదు. చూడాలి మరి, రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ‘భీష్మ’ ఎలాంటి రిజల్ట్‌ అందుకుంటుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS