హీరో.... ఇక జీరో!

మరిన్ని వార్తలు

ఏ ముహూర్తాన విజ‌య్ దేవ‌రకొండ `హీరో` సినిమాని మొద‌లెట్టాడో గానీ, ఆ సినిమాకి ముందు నుంచీ అన్నీ ఆటంకాలే. కొంత‌మేర షూటింగ్ జ‌రిగాక‌... ఆ ఎపిసోడ్ల‌న్నీ ప‌క్క‌న పెట్టేసి, మ‌ళ్లీ రీషూట్ చేశారు. ఆ త‌ర‌వాత సినిమాని ఆపేశారు. క‌థ‌లో మార్పులు చేసుకుంటూ వెళ్లారు, ఇప్నుడు ఏకంగా సినిమానే ఆపేశారు. అవును.. విజ‌య్ సినిమా `హీరో` ఇక జీరో అయిన‌ట్టే. ఈ సినిమా ఆపేశారు. మైత్రీ మూవీస్ ఈ సినిమాకి చ‌మ‌రగీతం పాడేసింద‌ని టాక్‌. ఇటీవ‌ల విజ‌య్ న‌టించిన `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` విడుద‌లై, డిజాస్ట‌ర్ టాక్ మూట‌గ‌ట్టుకుంది.

 

అంత‌కు ముందు వ‌చ్చిన `డియ‌ర్ కామ్రేడ్‌` కూడా ఫ్లాపే. వ‌రుస ఫ్లాపుల నేప‌థ్యంలో ఇక విజ‌య్‌పై ప్ర‌యోగాలు చేయ‌కూడ‌ద‌ని మైత్రీ మూవీస్ సంస్థ భావిస్తోంది. అందుకే.. `హీరో`సినిమాని ఆపేసింది. ఆస్థానంలో మ‌రో సినిమాని విజ‌య్‌తో ప‌ట్టాలెక్కించాల‌ని, `టాక్సీవాలా`లా తక్కువ బ‌డ్జెట్‌లో పూర్త‌యిపోయే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థ కోసం మైత్రీ మూవీస్ అన్వేషిస్తోంది. ఆ క‌థ‌తో ఎవ‌రొస్తే వాళ్ల‌తో ఈ సినిమా పట్టాలెక్కుతుంద‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS