ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టాడు రవితేజ. టచ్ చేసి చూడు, నేల టికెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ... ఇవి మూడూ ఒకదాన్ని మించి మరోటి ఫ్లాప్ అయ్యాయి. నిర్మాతలకు, పంపిణీదారులకు భారీ నష్టాల్ని మిగిల్చాయి. ఈ ఫ్లాపులు రవితేజ ఇమేజ్, మార్కెట్ పై కూడా ప్రభావం చూపించాయి. అందుకే ఇక మీదట ఆచి తూచి అడుగులు వేయాలని రవితేజ ఫిక్సయిపోయాడు. తనచేతిలో రెండు సినిమాలున్నా... రవితేజ తొందర పడడం లేదు. వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహించనున్న 'డిస్కోరాజా' ఈపాటికే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. అన్నీ రెడీగానే ఉన్నా.. రవితేజ మాత్రం 'ఓకే' చెప్పడం లేదు.
దానికి కారణం.. ఈ స్క్రిప్టులో రవితేజకు చాలా డౌట్లు ఉన్నాయట. అవి ఒకొక్కటీ క్లారిఫై చేసుకుంటూ వెళ్తున్నాడు. హాలీవుడ్ సినిమాని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథని తయారు చేసుకున్నట్టు సమాచారం. సమంత నటిస్తున్న 'మిస్ గ్రానీ' రీమేక్‌కీ ఈ కథకూ దగ్గర పోలికలు ఉన్నాయట. అందుకే.. స్క్రిప్టులో మార్పులు మొదలైనట్టు సమాచారం. మరోవైపు సంతోష్ శ్రీన్‌వాస్‌తో ఓ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ కథపై కూడా రవితేజ కసరత్తులు చేస్తున్నాడట. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టి చూపించాలన్నది రవితేజ పంతం. తనకి హిట్టు అవసరం కూడా. అందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.