స‌త్యం థియేట‌ర్.. ఇక బ‌న్నీ సొంతం??

By Gowthami - February 28, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

హైద‌రాబాద్‌లోని అమీర్ పేట్‌లో స‌త్యం థియేట‌ర్ గురించి తెలియ‌నివాళ్లు ఉండ‌రు. ద‌శాబ్దాలుగా అమీర్ పేట్ చుట్టుప‌క్క‌ల సినీ ప్రేమికుల‌కు ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని చూపించింది స‌త్యం థియేట‌ర్‌. సినీ ప్రేమికుల‌కు అదో అడ్డా. ఇప్పుడు ఈ స‌త్యం థియేట‌ర్ అల్లు అర్జున్ చేతిలోకి వ‌చ్చేసింది. ఈ ప్రాంగ‌ణంలో ఓ మ‌ల్టీప్లెక్స్ క‌ట్ట‌డానికి బ‌న్నీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు టాక్‌. ఏసియ‌న్ సినిమాస్ తో క‌ల‌సి బ‌న్నీ ఈ మ‌ల్టీప్లెక్స్ నిర్మించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

 

హైద‌రాబాద్‌లోని కొత్త‌ గూడలో మ‌హేష్ బాబు ఏఎంబీ పేరిట ఓ మ‌ల్టీప్లెక్స్ నిర్మించాడు. అది కూడా ఏసియ‌న్ సినిమా వాళ్ల భాగ‌స్వామ్యంతోనే.  అత్యాధునిక హంగుల‌తో ఉన్న ఈ మ‌ల్టీప్లెక్స్ సినీ ప్రేమికుల్ని బాగా ఆక‌ర్షిస్తోంది. అలాంటి హంగుల‌తోనే హైద‌రాబాద్ నడి బొడ్డున ఓ మ‌ల్టీప్లెక్స్ నిర్మించాల‌ని క‌ల‌లు కంటున్నాడు బ‌న్నీ. త‌న‌కు స‌త్యం థియేట‌ర్ ప్రాంగ‌ణం ఆక‌ర్షిస్తోంది. అతి త్వ‌ర‌లో ఇక్క‌డ ఓ మ‌ల్టీప్లెక్స్ రాబోతోంద‌న్న‌మాట‌. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS