'కృష్ణ' కాంబో.. మ‌రోసారి

మరిన్ని వార్తలు

'ఇంటిలిజెంట్‌' త‌ర‌వాత వినాయ‌క్ సినిమా ఏదీ ప‌ట్టాలెక్క‌లేదు. బాల‌కృష్ణ‌తో సినిమా చేద్దామ‌ని చాలా ప్ర‌య‌త్నించాడు వినాయ‌క్‌. రెండు మూడు క‌థ‌లు కూడా వినిపించాడు. కానీ ఏదీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఇప్పుడు ర‌వితేజతో ఓ సినిమా ప‌క్కా అయ్యింద‌ని స‌మాచారం. ర‌వితేజ - వినాయ‌క్ కాంబోలో వ‌చ్చిన 'కృష్ణ‌' సూప‌ర్ హిట్టయ్యింది. 

 

ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి వినోద‌భ‌రిత‌మైన క‌థ‌తోనే ర‌వితేజ‌ని క‌లిశాడ‌ట వినాయ‌క్‌. ఈ క‌థ ర‌వితేజ‌కు న‌చ్చ‌డం, ఆయ‌న‌ వెంట‌నే ప‌చ్చ‌జెండా ఊప‌డం అయిపోయాయి. సి.క‌ల్యాణ్ ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. త్వ‌ర‌లోనే మిగిలిన వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి. ప్ర‌స్తుతం వి.ఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో 'డిస్కో రాజా' అనే ఓ సినిమా చేస్తున్నాడు ర‌వితేజ‌. ఆ సినిమాతో పాటే ఈ చిత్రాన్నీ పట్టాలెక్కిస్తార‌ని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS