ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి ఛాన్సిచ్చాడు.. త‌ప్పు చేస్తున్నాడా??

By Gowthami - January 26, 2020 - 12:20 PM IST

మరిన్ని వార్తలు

ర‌వితేజ అస‌లే ఫ్లాపుల్లో ఉన్నాడు. గ‌తేడాది ర‌వితేజ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇటీవ‌ల విడుద‌లైన 'డిస్కోరాజా' కూడా అంతంత మాత్రంగానే ఉంది. మంచి క‌థ‌లు, ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌కులు, స‌రికొత్త పాత్ర‌లు ఎంచుకోవాల్సిన ఈ త‌రుణంలో ర‌వితేజ మ‌రో త‌ప్పు చేస్తూ - ఓ ఫ్లాప్ ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇచ్చాడు. త‌నే.. ర‌మేష్ వ‌ర్మ‌.

 

ఇటీవ‌ల బెల్లంకొండ శ్రీ‌నివాస్‌ని 'రాక్ష‌సుడు'గా చూపించాడు ర‌మేష్ వ‌ర్మ‌. ఆ సినిమా హిట్ట‌య్యింది. కాక‌పోతే... ఇది వ‌ర‌కు ర‌వితేజ‌తో ప‌నిచేశాడు ర‌మేష్ వ‌ర్మ‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో `వీర‌` వ‌చ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా స‌రే, ర‌వితేజ మ‌రోసారి ఈ ద‌ర్శ‌కుడిని న‌మ్ముకోవ‌డం ఆశ్చ‌ర్యం అనిపిస్తోంది. ర‌వితేజ చేసిన త‌ప్పే మ‌ళ్లీ చేస్తున్నాడా? అనే అనుమానం వేస్తోంది. వ‌చ్చే నెల‌లో ఈ కాంబో లాంఛ‌నంగా ప్రారంభం అవుతుంది. మార్చి నుంచి షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఈ చిత్రానికి కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS