బ్యాండ్‌ బాజా మోగించనున్న 'డిస్కోరాజా'.!

మరిన్ని వార్తలు

విలక్షణ దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'డిస్కోరాజా' రేపట్నుంచి సెట్స్‌ మీదికెళ్లనుంది. మాస్‌ రాజా రవితేజ హీరోగా రూపొందతుతోన్న ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన టైటిల్‌ ఫస్ట్‌లుక్‌తో సినిమాలో థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌ ఏదో ఉందనే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశారు. అవును వి.ఐ.ఆనంద్‌ సినిమాలంటేనే థ్రిల్లర్‌ మూవీస్‌ అని చెప్పాలి. 

 

గతంలో ఆయన డైరెక్షన్‌లో వచ్చిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' మూవీస్‌ హిట్‌ లిస్ట్‌లో ఉన్న చిత్రాలే. అలాగే ఎక్కువ ప్రేక్షకాదరణ పొందాయి కూడా. ఇప్పుడు మాస్‌ రాజాతో తీయబోయే 'డిస్కోరాజా'లో కూడా ఆశక్తికరమైన విషయం దాగుందట. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. అందులో ఒకటి తండ్రి పాత్రనీ సమాచారమ్‌. రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. 

 

కాగా రీ ఎంట్రీలో రవితేజ 'రాజా ది గ్రేట్‌' సినిమాతో హిట్‌ కొట్టాడు. కానీ తర్వాత మళ్లీ నిరాశపరిచాడు. ట్రిపుల్‌ ధమాకా అంటూ వచ్చిన లేటెస్ట్‌ మూవీ 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ'తోనూ భారీగా నిరాశపరిచాడు. కానీ 'డిస్కోరాజా'తో హిట్‌ కొడతానని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. రవితేజలోని ఇదివరకటి ఎనర్జీ లెవల్స్‌ని ఈ సినిమాలో చూడబోతున్నామట. చూడాల మరి మాస్‌రాజా మాట నిలబెట్టుకుంటాడో లేదో.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS