గుడ్ న్యూస్‌... మ‌హేష్ బాబు డ‌బుల్ థ‌మాకా

మరిన్ని వార్తలు

అగ్ర హీరోల్లో ఆచి తూచి సినిమాలు చేసేది మ‌హేష్ బాబు మాత్ర‌మే. మిగిలిన హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేస్తుంటే.. మ‌హేష్ మాత్రం ఏడాదికి ఒక‌టి... మూడేళ్ల‌కు రెండు అంటూ నిదానంగా న‌డుస్తుంటాడు. కానీ.. మ‌హేష్‌లోనూ మార్పు వ‌చ్చింది. వ‌రుస‌గా సినిమాలు చేయాల‌ని డిసైడ్ అయ్యాడు. క‌థ న‌చ్చితే... ఒకేసారి రెండు సినిమాలు ప‌ట్టాలెక్కించ‌డానికి కూడా సిద్ద‌మ‌వుతున్నాడు.

 

ఇప్పుడు మ‌హేష్ ఒకేసారి రెండు సినిమాల్ని మొద‌లెట్టాల‌ని చూస్తున్నాడు. మ‌హ‌ర్షి త‌ర‌వాత‌... మ‌హేష్ ఏం చేస్తాడ‌న్న ఆస‌క్తి నెల‌కొంది. అటు సుకుమార్ ఇటు అనిల్ రావిపూడి.. ఇద్ద‌రూ క‌థ‌లు రెడీ చేస్తున్నారు. వీళ్ల‌లో ఒక‌రి సినిమాని ప‌ట్టాలెక్కించ‌డం ఖాయ‌మైంది. అయితే.. మ‌హేష్ ఇప్పుడు ఓ స‌రికొత్త నిర్ణ‌యం తీసుకున్నాడు. ఒకేసారి ఈ రెండు సినిమాల్నీ పూర్తి చేయాల‌ని భావిస్తున్నాడు.  

 

ఇటీవ‌ల సుకుమార్ మ‌హేష్‌ని క‌లిసి క‌థ వినిపించాడు. అది మ‌హేష్‌కి బాగా న‌చ్చింది. మ‌రోవైపు అనిల్ రావిపూడి క‌థ కూడా న‌చ్చింది. ఈరెండు సినిమాల్నీ స‌మాంత‌రంగా పూర్తి చేయాల‌న్న‌ది మ‌హేష్ ఆలోచ‌న‌. మ‌హర్షి ఏప్రిల్‌లో విడద‌ల అవుతుంది. ఈ యేడాదే మ‌రో సినిమాని వ‌దిలితే ఎలా ఉంటుందా? అన్న‌ది మ‌హేష్ ప్లాన్‌. లేదంటే సంక్రాంతికి మ‌హేష్ సినిమా ఖాయంగా వ‌స్తుంది. మొత్తానికి మ‌హేష్ ఫ్యాన్స్‌కి ఇది డ‌బుల్ బొనాంజానే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS