చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది శాస్త్రం. ఇప్పుడు సినిమా వాళ్లు సైతం అదే ఫాలో అవుతున్నారు. చిన్న పాత్రనైనా.. పెద్ద స్టార్ కావాల్సిందే. అలాంటప్పుడు విలన్ పాత్రలు అనామకులతో ఎందుకు చేయిస్తారు? ఆ పాత్రలకీ స్టార్ల అవసరం ఉంది. అందుకే మాజీ హీరోలు మన సినిమాల్లో విలన్లు అయిపోతున్నారు. తాజాగా.. అర్జున్ కీ అలాంటి అవకాశమే వచ్చింది.
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఖిలాడీ. రమేష్ వర్మ దర్శకుడు. మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతీ హీరోయిన్లు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా అర్జున్ ని ఖరారుచేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అర్జున్‌కి కథ వినిపించడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయట. 2021 వేసవిలో విడుదల కానుంది. అర్జున్ విలన్ గా నటించడం ఇదే తొలిసారి కాదు. `నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా`, `లై` సినిమాలలో విలన్ గా కనిపించాడు. అయితే ఆ రెండు సినిమాలూ ఫ్లాపే. మరి ఈసారి ఏం జరుగుతుందో..?