రీక్యాప్ 2018: టాలీవుడ్ లో చెల‌రేగిన‌ గాసిప్పులు

By iQlikMovies - January 05, 2019 - 08:47 AM IST

మరిన్ని వార్తలు

చిత్ర‌సీమ‌కూ గాసిప్పుల‌కూ విడ‌దీయ‌లేని అనుబంధం. గాసిప్పులు ఎదుర్కోని హీరో, హీరోయిన్ ఉండ‌రేమో. ఈమ‌ధ్య హాస్య‌న‌టుల‌పై కూడా గాసిప్పులు పుట్టుకొచ్చేస్తున్నాయి. అందులో నిజానిజాలేంట‌న్న విష‌యాన్ని పక్క‌న పెడితే కొన్ని రోజులు ఆ వార్తలు హ‌ల్‌చ‌ల్ చేస్తాయి. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోతాయి. అలాంటి గాసిప్పులు 2018లోనూ చాలా క‌నిపించాయి, వినిపించాయి. హాట్ వార్త‌ల్ని పుట్టించాయి.

క‌థానాయిక‌ల‌పై గాసిప్పులు స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. ఈసారి కొంత‌మంది నాయిక‌లు ఈ వార్త‌ల‌కు కాస్త‌నొచ్చుకున్నారు. ఇబ్బంది ప‌డ్డారు. ఇలియానా గ‌ర్భ‌వ‌తి అనే వార్త టాలీవుడ్‌లో బాగానే చ‌క్క‌ర్లు కొట్టింది. ఈ వార్త ఆమె అభిమానుల్ని కంగారు పెట్టింది. ఇలియానా కాస్త లావుగా క‌నిపించ‌డం, సినిమాల‌కు పూర్తిగా దూరంగా ఉండ‌డంతో.. ఇది నిజ‌మే అనుకున్నారంతా. కానీ.. అలాంటిదేం లేద‌ని ఇలియానానే క్లారిటీ ఇచ్చేసింది.

గ‌త కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో `అనుష్క పెళ్లి` అనేది రెగ్యుల‌ర్ గాసిప్ అయిపోయింది.  అప్పుడప్పుడూ ఈ వార్త అలా వ‌చ్చి.. ఇలా వెళ్లిపోతుంటుంది. ప్ర‌భాస్ పెళ్లి అనుష్క‌తోనే అనేది పాత గాసిప్‌. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త రూపు లో వ‌స్తుంటుంది. దీనిపై ప్ర‌భాస్ కూడా చాలాసార్లు స్పందించాడు. రానా పేరు గాసిప్పుల‌లో త‌ర‌చూ వినిపిస్తుంటుంది. ఈమ‌ధ్య రానా ఆరోగ్యం బాగా చెడిపోయింద‌ని, కిడ్నీ మార్పిడి జ‌ర‌గ‌బోతోంద‌ని వార్త‌లొచ్చాయి. ఇదేం పూర్తిగా అవాస్త‌వం ఏమీ కాదు. రానా చికిత్స నిమిత్తం ఈమ‌ధ్య విదేశాల‌కూ వెళ్లొచ్చాడు.

సాయి ప‌ల్ల‌వి పేరు ఈమ‌ధ్య గాసిప్పుల్లో బాగానే వినిపించింది. `క‌ణం` సినిమా సంద‌ర్భంగా సెట్లో నాగ‌శౌర్య‌తో సాయి ప‌ల్ల‌వికి గొడ‌వైంద‌న్న‌ది వార్త‌ల‌లో సారాంశం. `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు` టైమ్‌లోనూ ఇలాంటి వార్త‌లు చెల‌రేగాయి.  అజ్ఞాత‌వాసి త‌ర‌వాత ప‌వ‌న్ పూర్తిగా రాజ‌కీయాల‌కు ప‌రిమిత‌మ‌య్యాడు. అయితే.. డాలీ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త వ‌చ్చింది. అది కేవ‌లం పుకారే అని ప‌వ‌న్ తేల్చి పాడేశాడు.

రీక్యాప్ 2018, ఐక్లిక్ మూవీస్ (iQlikmovies)


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS