రేణూ పెళ్లి అయిపోయిందా? ఆగిపోయిందా?

By Gowthami - February 21, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

రేణు దేశాయ్ పేరు ఎప్పుడు వార్త‌ల్లోకి వ‌చ్చినా, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో విడాకుల వ్య‌వ‌హారం, ఆ పిద‌ప ఆమె చేసిన ట్వీట్లు... జ్ఞ‌ప్తికి వ‌చ్చేస్తాయి. రేణు ట్వీట్లు సినీ వ‌ర్గాల్లో ముఖ్యంగా, ప‌వ‌న్ అభిమానుల్లో క‌ల‌క‌లం సృష్టించాయి. కొంత‌మంది రేణుకి స‌పోర్ట్ చేస్తే, ఇంకొంత‌మంది నెగిటీవ్‌గా ట్రోల్ చేశారు. ఎనిమిది నెల‌ల క్రితం రేణు మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకోబోతున్నా అని ప్ర‌క‌టించింది. అంతేకాదు.. నిశ్చితార్థం కూడా జ‌రిగిపోయిన‌ట్టు ఓ ఫొటో కూడా పోస్ట్ చేసింది.

 

దాంతో ప‌వ‌న్ అభిమానులు మ‌రింత రెచ్చిపోయారు. మ‌ళ్లీ పెళ్లేంటి? అని ట్వీట్లు చేయ‌డం మొద‌లెట్టారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ రంగంలోకి దిగి.. `రేణు జీవితం త‌న ఇష్టం. త‌న‌కిష్ట‌మైన నిర్ణ‌యం తీసుకునే హ‌క్కు త‌న‌కుంది` అని చెప్పేంత వ‌ర‌కూ ఆ ర‌గ‌డ ఆగ‌లేదు. నిశ్చితార్థం అయి ఎనిమిది నెల‌లైంది. అయితే రేణు దేశాయ్ పెళ్లి జ‌రిగిందా? ఆగిపోయిందా? అనే విష‌యం మాత్రం తెలియ‌నివ్వ‌లేదు. పెళ్లి చేసుకుంది అనేదానికి ఒక్క ఆధారం కూడా బ‌య‌ట పెట్ట‌లేదు. ఆగిపోయింది అనే సంగ‌తీ చెప్ప‌డం లేదు. 

 

తాజాగా తాను తెలుగు సినిమాల్లో న‌టిస్తున్నా.. అని ట్వీట్ చేసింది రేణు. ఓ రెండు సినిమాలు కూడా ఒప్పుకుంది. అయితే పెళ్లి విష‌యాన్ని ఈసారీ చెప్ప‌లేదు. రేణు పెళ్లి ఆగిపోయింద‌ని, అందుకే ఇప్పుడు సినిమాల‌తో బిజీ అవ్వాల‌నుకుంటుంద‌ని ఓ వ‌ర్గం చెబుతోంది. అదేం కాదు, రేణు పెళ్ల‌యిపోయింది.. కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు భ‌య‌ప‌డి వ‌రుడి పేరు బయ‌ట‌పెట్టడం లేదు.. అని మ‌రో వ‌ర్గం అంటోంది. మొత్తానికి రేణు పెళ్ల‌య్యిందా? లేదా? అనేది ప‌వ‌న్ అభిమానుల‌కు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారిపోయింది. ఈ చిక్కుముడి రేణూనే విప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS