పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఇప్పటికి ఆయన అభిమానులు రేణు దేశాయ్ ని తమ వదినగా పిలుచుకుంటుంటారు. అయితే గత కొంతకాలంగా ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నట్టు తెలపగానే తీవ్రమైన వ్యతిరేకత రావడం మనం గమనించాము.
ఇక ఈ విషయాన్నీ అటుంచితే అసలు పవన్ కళ్యాణ్ నుండి రేణు దేశాయ్ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అన్న అంశం ఇప్పటికి ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఇదే ప్రశ్నని ఆమెని ఒక ప్రముఖ టాక్ షోలో అడగగా ఆమె దానికి తన ఆత్మకథలో చెబుతాను అని తెలిపింది.
అయితే ఆ ఆత్మకథని మాత్రం తన జీవిత చరమాంకంలోనే రాస్తాను అని అలాగే విడిపోవడానికి కూడా కారణాలు అందులోనే చెబుతాను అని చెప్పుకొచ్చింది.
ఇలా సమాధానం చెప్పి ఆ కారణమేంటి అనే దాని పైన ఇంకా సస్పెన్స్ పెంచేసింది రేణు దేశాయ్.