'జనసేన' పై ఆశక్తికర వ్యాఖ్యలు చేసిన రేణుదేశాయ్

By iQlikMovies - January 02, 2019 - 17:27 PM IST

మరిన్ని వార్తలు

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చింది. తాను రాసిన కవితల పుస్తకం 'ఎ లవ్, అన్ కండీషనల్' ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'జనసేన' పై చేసిన కామెంట్స్ పవన్ ఫాన్స్ లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలపై మాట్లాడిన రేణు తాను రాజకీయాలని కూడా బాగా ఫాలో అవుతానని, కానీ ఆ విషయాలను ఎక్కడ ప్రస్తావించానని చెప్పింది. కారణం, తాను రాజకీయాల గురించి మాట్లాడితే వివాదాస్పదమైన చర్చలు జరుగుతాయి అంటూ జోక్ చేసింది. 

 

అదేవిధంగా, ఈ మధ్య జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గారి టిఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుందని ముందే ఊహించానంటూ తన అంచనాలను బయట పెట్టింది. అలాగే ఈ సంవత్సరంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు అని అడిగితే, తనకి అవగాహన ఉన్నా తన అంచనాలను బయట పెట్టనని అంటుంది రేణు దేశాయ్.

 

ఇక్కడే అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది రేణు. తాను కూడా 'జనసేన' కుటుంబంలో భాగమేనని పవన్ కళ్యాణ్ దేశం కోసం నిజాయితీగా పనిచేస్తున్న తీరు, నిబద్దత తనకి చాలా ఇష్టం అంటూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా, తాను పవన్ కళ్యాణ్ విడిపోయినా పిల్లల విషయంలో తరచూ మాట్లాకుంటూనే ఉంటామని, ఆయనను తన పిల్లల తండ్రిగా మాత్రమే గుర్తిస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

 

దీంతో పవన్ అభిమానుల మధ్య ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. తాను కూడా జనసేన కుటుంబంలో భాగస్వామిని అనటంలో అంతరార్ధం ఏంటి అన్నది ఎవరికీ అంతు పట్టటంలేదు. ఇప్పటికే నాగబాబు, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తదితర మెగా కుటుంబ సభ్యులు వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారారానికి తమ సంసిద్ధతను వ్యక్తపరుస్తున్న తరుణంలో, ఆ లిస్టులో పవన్ మాజీ భార్య 'రేణు దేశాయ్' కూడా చేరటం అభిమానులందరికీ షాకింగ్ వార్తే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS