అయ్యో పాపం విశాల్‌ ఏం చేశాడు.!

మరిన్ని వార్తలు

తెలుగు సినీ ప్రముఖులపై అనవసర ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు తమిళ సినీ ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ వస్తోంది. డైరెక్టర్‌, ఓ హీరో అయిపోయాడు. 

తాజాగా తమిళ హీరో విశాల్‌పై ఆరోపణలు చేస్తోంది శ్రీరెడ్డి. తమిళ సినిమాకి సంబంధించి స్టార్‌ హీరోగా మాత్రమే కాకుండా, సినిమా నిర్మాతల మండలి అధ్యక్షుడిగా హుందాతనంగా వ్యవహరిస్తున్నాడు విశాల్‌. మొన్నామధ్య కాస్టింగ్‌ కౌచ్‌పై తనదైన శైలిలో స్పందించాడు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ టోటల్‌ సినీ పరిశ్రమ అంతా ఇలాంటిదే అంటూ ఆధారాలు లేకుండా ఆభాండాలు వేయడం తగదని విశాల్‌ గతంలో స్పందించాడు. ఒకవేళ అది మనసులో పెట్టుకుందో ఏమో కానీ, శ్రీరెడ్డి గాలి ఇప్పుడు విశాల్‌ మీదకు మళ్లింది. విశాల్‌పై దారుణమైన అభాండాలు వేస్తోంది. 

అయితే శ్రీరెడ్డి ఆరోపణల పర్వం కాస్త డిఫరెంట్‌గా ఉంది విశాల్‌ విషయంలో. తనను లైంగికంగా వేధించాడనో మరోటో కాదు కానీ, విశాల్‌ నుండి తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ ఆరోపణలు చేస్తోంది. తెలుగువాడైనా, తమిళ సినిమాల్లో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు విశాల్‌. అక్కడ నటుడిగానే కాకుండా, సామాజిక అంశాలపై కూడా ఇన్‌ టైంలో స్పందిస్తుంటాడు విశాల్‌. అలాంటి విశాల్‌పై శ్రీరెడ్డి ఆరోపణలు ఏ స్థాయికి చేరతాయో. 

వీటి విషయంలో విశాల్‌ ఎలా స్పందిస్తాడో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS