ఎప్పటికప్పుడే సంచలన వ్యాఖ్యలతో హాట్ హాట్ న్యూస్‌లో ఉండే రామ్‌గోపాల్ వర్మ తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశారు. 'మన ఇండియన్స్‌కి బుర్ర లేదు' అని ఆయన సెలవిచ్చారు. అంటే ఆయన ఉద్దేశ్యంలో ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్‌కి అస్సలు బ్రెయిన్ లేదట. అందుకే హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తెరకెక్కించలేకపోతున్నారనీ వర్మ అభిప్రాయ పడుతున్నారు.
హాలీవుడ్‌లో అంత మంచి సినిమాలు తెరకెక్కుతున్నాయి. తెలుగు, హిందీ, ఇతర భాషలతో పోల్చుకున్నా, మన ఇండియాలో ఆ స్థాయిలో సినిమాలు రావడం లేదు ఎందుకంటే, అందుకేనని (బుర్ర లేకపోవడం వల్లనేనట) వర్మ అంటున్నారు. ఆయన కూడా ఓ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టరే కదా.. అంటే ఆయన కూడా అంత గొప్ప డైరెక్టర్ కాదని ఆయన అభిప్రాయం కాబోలు. ఈ మధ్య 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్‌టీ)' వీడియోతో ఆయన సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. మహిళా సంఘాలు వర్మపై చీవాట్ల వర్షం కురిపించినా, కొందరు సపోర్ట్ చేసినా, చాలా మంది సినీ ప్రముఖులే విమర్శించినా, ఎన్ని వివాదాలు తలెత్తినా, ఆ వీడియోని విడుదల చేసి తీరాడు వర్మ. అదీ వర్మ అంటే.
అయితే ఇంతగా హోరెత్తిన వివాదాల విషయంలో ఆయన స్పందన ఏంటని వర్మగారిని ఆడగ్గా, అలా వివాదాలు సృష్టించే వాళ్లకు అస్సలు పనే లేదనీ, వాళ్లంతా కాకుల్లాంటి వారనీ సింపుల్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చేశారు మన ప్రియమైన డైరెక్టర్‌గారు. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే, ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నాగార్జున సినిమా ప్రస్తుతం 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుందని వర్మ చెప్పారు.