వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' బిజినెస్ విషయంలో కొన్ని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా 10 కోట్లకు బిజినెస్ అయిపోయిందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఈ విషయమై వర్మ తాజాగా స్పందించారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రీ రిలీజ్ బిజినెస్‌పై వస్తున్న వార్తలన్నీ వదంతులే. అందులో ఎంత మాత్రమూ నిజం లేదు. ఇంకా మా సినిమాకి బిజినెస్ స్టార్ట్ కాలేదు. ఇంకా ఎవ్వరికీ సినిమాని అమ్మలేదు.
బిజినెస్‌పై వస్తున్న వార్తల్ని నమ్మొద్దని వర్మ క్లారిటీ ఇచ్చారు. సో బిజినెస్ ఇంకా కాకుంటే, రిలీజ్ డేట్ విషయంలో మళ్లీ సందిగ్థత నెలకొన్నట్లే. మార్చి 15న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రేక్షకుల ముందుకు రానుందన్న వార్తల్లో కూడా నిజం లేదనుకోవాలి. బిజినెస్ విషయంలో క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ, రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.
సో వర్మ నోరు విప్పేదాకా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ ఎప్పుడనేది కన్ఫామ్ కాదు. ట్రైలర్‌ని అంత గొప్పగా కట్ చేసి విడుదల చేసిన వర్మ సినిమాని ఇంకా గొప్పగా తెరకెక్కిస్తుండుండాలి. అందుకే ఇంకాస్త టైం పడుతుందేమో. చూడాలి మరి లేటైనా, లేటెస్ట్గా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు వర్మ. నో కన్ఫ్యూజ్.. ఇది కన్ఫామ్.