'స్వప్న సుందరి', 'కలలో రాకుమారి' అనే మాటలు కుర్రోళ్లకు ఓ స్పెషల్ ఫీల్‌ని, థ్రిల్‌నీ ఇస్తుంటాయి. కలల రాకుమారిని పెళ్లి చేసుకోవాలని వయసుకొచ్చిన ప్రతీ కుర్రవాడు కోరుకుంటాడు. అయితే అందరికీ కలల రాకుమారులే జీవిత భాగస్వాములు అవుతారని చెప్పలేం కానీ, ఈ కుర్రోడు మాత్రం పదే పదే తన కలలో కనిపించిన అమ్మాయిని అన్వేషించడం కోసం చాలా పాట్లు పడుతుంటాడు. అన్వేషించీ, అన్వేషించీ.. ఆ అమ్మాయి కోసం ఏం చేశాడు.? ఎలాంటి అనూహ్య పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు.. అనే కథాంశంతో తెరకెక్కుతున్నదే '118' చిత్రం.
కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా కలలో రాకుమారిగా నటించిన నివేదా థామస్ సినిమాకి సంబంధించిన కొన్ని ముచ్చట్లు ఫ్యాన్స్‌తో పంచుకుంది. 'ఈ సినిమాలో నా పాత్ర చాలా కీలకమే కానీ, నిడివి మాత్రం చాలా తక్కువ. కేవలం 21 నిముషాలు మాత్రమే నేను స్కీన్‌పై కనిపిస్తాను.
కానీ ఆ సమయమే సినిమాలో అత్యంత కీలకం. నేను కనిపించిన ప్రతీ షాట్ ఆడియన్స్‌కి థ్రిల్ కలిగిస్తుంది.. అని చెబుతోంది నివేదా. 'జెంటిల్‌మెన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నివేదా థామస్ వరుసపెట్టి సినిమాలు చేసేయకుండా, మంచి కథలను ఎంచుకుంటూ ఆచి తూచి వ్యవహరిస్తోంది. నటిగా ప్రాధాన్యత ఉన్న పాత్రల్నే ఎంచుకుంటోంది. అలా '118' సినిమా నివేదా కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుందేమో చూడాలి మరి.