బిగ్‌బాస్ సీజన్ 3 హోస్ట్ నాగార్జున విన్నర్‌గా రాహుల్ పేరును ప్రకటించగానే శ్రీముఖి అస్సలు తట్టుకోలేకపోయింది. ఆమె ముఖ కవలికలను పరిశీలించిన ఆమె ఫ్యాన్స్ అది అస్సలు తట్టుకోలేకపోయారు. ఆమె ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోయారు. దాంతో బిగ్‌బాస్ విన్నర్ ప్రకటన అనంతరం, సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే నడిచింది.
కొత్త సినిమా రిలీజైతే, ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ మధ్య జరిగే రచ్చని తలపించింది ఈ సీజన్ బిగ్‌బాస్ విజేత ప్రకటన. రాత్రంతా ఒక రేంజ్లో కొట్టుకున్నారు ఇటు శ్రీముఖి ఫ్యాన్స్, అటు రాహుల్ ఫ్యాన్స్. నిజానికి ఈ సీజన్ బిగ్‌బాస్‌లో లీకు వీరుల పుణ్యమా అని, ఎలిమినేషన్స్ అన్నీ ముందే తెలిసిపోయాయి. కానీ, ఫినాలే ఎపిసోడ్‌ని మాత్రం బిగ్‌బాస్ నిర్వాహకులు చాలా గోప్యంగా ఉంచారు.
అంతవరకూ శ్రీముఖినే బిగ్‌బాస్ విన్నర్ అంటూ అందరూ తాపీగా కూర్చున్నారు. కానీ, ఈ విషయమై గ్యారంటీగా ఎక్కడా లీకులు రాలేదు. దాంతో చివరి నిమిషం చాలా ఉత్కంఠ నెలకొంది. ఉత్కంఠకు తగ్గట్లుగానే, అందరూ ఊహించిన దాని కంటే భిన్నంగా బిగ్‌బాస్ విన్నర్ ప్రకటన జరిగింది. శ్రీముఖిని ఓడించి, రాహుల్ బిగ్‌బాస్ టైటిల్ విజేతగా నిలిచారు. మెగాస్టార్ చేతుల మీదుగా బిగ్‌బాస్ ట్రోఫీని అందుకున్నాడు రాహుల్.