'లక్ష్మీస్ ఎన్టీఆర్' టైటిల్‌తో ఎన్టీఆర్ జీవిత గాధని ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుండీ ప్రతీ రోజు ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ ఆడియన్స్‌కి స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూనే ఉంది. అవును మరి అక్కడ ఉన్నది ఎవరు వర్మ కదా. సరే వర్మ ఈ సినిమాని లక్ష్మీపార్వతి యాంగిల్ నుండి తీస్తారంటున్నారు. అసలు ఏ ఏ అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయనే దానిపైనే అందరి దృష్టి. ఈ విషయంలో రోజుకో న్యూస్ వర్మ నుండి బయటికి వస్తోంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన అంశాన్ని మాత్రమే తీసుకుని తాను సినిమా తెరకెక్కిస్తున్నాననీ, ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన అతి ముఖ్యమైన అంశాలన్నీ తన సినిమాలో ఉండబోతున్నాయి, కానీ రాజకీయ కుట్రలేమీ ఉండవనీ వర్మ అన్నారు. లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇచ్చినాక ఆయన జీవితంలో జరిగిన మార్పుల్లో అత్యంత కీలక ఘట్టాలు కొన్ని తనని ఇన్‌స్పైర్ చేశాయనీ, వాటిని దృష్టిలో పెట్టుకుని అవే హైలైట్ చేస్తూ మాత్రమే తాను సినిమా తెరకెక్కిస్తాననీ వర్మ అన్నారు. అలాగే ఎన్టీఆర్ గొప్ప మహానుభావుడు. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని చాలా సినిమాలే తీయొచ్చనీ, నేను తీసేశాను కాబట్టి ఇంక ఆయన జీవిత గాధ అయిపోయిందనుకుంటే పొరపాటే. ఆయన జీవితం మహాభారతం లాంటిది. ఎవరెన్ని సినిమాలైనా తీసుకోవచ్చనీ వర్మ అన్నారు. అయితే ఒక్క విషయం.. ఈ సినిమా తర్వాత నేను మరోసారి ఆయన జీవిత గాధని తెరకెక్కించను అని వర్మ స్పష్టం చేశారు. రాకేష్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని వర్మ తెలిపారు.