వర్మాయణం: వేలంటైన్స్‌డేకి ఆంజనేయుడికి లింకేంటీ.?

మరిన్ని వార్తలు

'ఎన్టీఆర్‌ అబద్ధపు అభిమానులారా.. వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా.. రేపు పొద్దున్నే మీ దగ్గరల్లో ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ఆకు పూజ చేయించుకుని రెడీగా ఉండండి. ఉదయం 9:27 గంటలకల్లా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' టీజర్‌ మీ ముందు ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్లకు నేను బాధ్యున్ని కాదు..' అంటూ వర్మ తాజాగా తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. రేపు వేలంటైన్స్‌డే. ప్రేమికుల రోజు. 

 

ప్రేమికుల రోజున బ్రహ్మచారి అయిన ఆంజనేయ స్వామి గుడికి వెళ్లడమేంటయ్యా వర్మ. ఇట్స్‌ టూ మచ్‌. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'ని ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీగా వర్మ అభివర్ణించారు. ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతిల మధ్య లవ్‌ ఏంటబ్బా.. ఇలాంటి ఐడియాలు వర్మకే వస్తుంటాయి. ఇకపోతే 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' ఫెయిల్యూర్‌ని వర్మ పదే పదే ప్రస్ధావిస్తూ ప్రత్యర్ధుల్ని రెచ్చగొడుతున్నారు. 

 

ఇక రేపు 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' టీజర్‌ రానుంది. మా టీజరే చాలా సూపర్బ్‌గా ఉంటుంది. దాన్ని చూసి మీరు కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయం. ఆ కన్నీళ్లకు నేను మాత్రం బాధ్యున్ని కాను.. అని వర్మ గిల్లుతున్నట్లుంది. రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్‌లో ఎవరినైతే ప్రస్థావించారో వాళ్లు ఒకవేళ టీజర్‌ని చూడకూడదనుకున్నా, తన గిల్లుడుతో వారి దృష్టిని అటువైపు ఆకర్షించేలా ఉంది ఈ ట్వీట్‌. అందుకే వర్మ ది స్పెషల్‌. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS