ఆర్జీవీ వాడకం అదిరిపోయిందంతే.!

మరిన్ని వార్తలు

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకి సినిమాకి దర్శకత్వం వహించడమే కాదు, తాను తెరకెక్కించిన సినిమా ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో కూడా బాగా తెలుసు. వినూత్న పద్ధతుల్లో తన సినిమాలకు పబ్లిసిటీ చేస్తుంటాడు రామ్‌గోపాల్‌ వర్మ. తాజాగా వర్మ దర్శకత్వంలో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమాకి సంబంధించి ఓ పక్క సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్‌ మీడియాలో ట్వీట్లతో సినిమాపై ఆశక్తి రేకెత్తిస్తున్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ ఈ ట్వీట్లు ఉంటున్నాయి. వర్మ ట్వీట్లకి సోషల్‌ మీడియాలో మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.

 

చంద్రబాబు కాంగ్రెస్‌నీ, ఎన్టీఆర్‌నీ, బీజేపీనీ వెన్నుపోటు పొడిచారా..? అంటూ కొన్ని సందర్భాలు ప్రస్థావిస్తూ.. 'ఎస్‌' ఆర్‌ 'నో' చెప్పమని ప్రశ్న ఒకటి ట్విట్టర్‌లో సంధించారు వర్మ. ఆ ప్రశ్నకు 'అవును' అని ఎక్కువ మంది, 'కాదు' అని కొంతమంది సమాధానమిస్తూ వర్మ ట్విట్టర్‌ అకౌంట్‌ని హోరెత్తించేస్తున్నారు. 

 

ఇదంతా వర్మ స్టైల్‌ ఆఫ్‌ పబ్లిసిటీ. ఫిబ్రవరి 14న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ట్రైలర్‌ విడుదలవుతోంది. ట్రైలర్‌ అయ్యాక హైప్‌ ఇంకెంతలా ఉంటుందో కానీ, ఇప్పటికైతే అంచనాలకు మించి ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS