రాజుగారు చెప్పింది పాయింటే క‌దా?!

మరిన్ని వార్తలు

థియేట‌ర్ల‌న్నీ న‌లుగురి చేతుల్లోనే ఉన్నాయ‌ని, థియేట‌ర్ల మాఫియా ఎక్కువైంద‌ని చిన్న నిర్మాత‌లు పోరెడుతుంటారు. `ఆ న‌లుగురు` అనే మాట త‌ర‌చూ వినిపిస్తుంటుంది కూడా. మొన్నామ‌ధ్య సంక్రాంతి సీజ‌న్‌లో థియేట‌ర్ల గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. చిన్న సినిమాల్ని రాకుండా అడ్డుకుంటున్నార‌ని కొంత‌మంది నిర్మాత‌లు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. వాటిపై ఇప్పుడు ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు కౌంట‌ర్ వేశాడు. 

 

‘కంటెంట్‌ లేని సినిమాలు తీసేవారికి థియేటర్లు కేటాయించి ఏం లాభం. కంటెంట్‌ లేకుండా ఏ చిన్న సినిమా ఆడదు. ఏదో సినిమా తీశామన్నట్లు ఉండకూడదు. ప్రచార కార్యక్రమాలకు ఎంతకాదన్నా రూ.కోటి ఖర్చుపెట్టాలి. ఈ విషయం అర్థం చేసుకోకుండా చాలా మంది సినిమాలు తీసేస్తున్నారు. ‘ఆర్ఎక్స్‌ 100’ సినిమా చూడండి.. తొలిరోజు ప్రేక్షకుల తాకిడిని చూసి రెండో రోజు నుంచే థియేటర్ల సంఖ్యను పెంచేశారు. ఎందుకంటే ఆ సినిమాకు ఆడియన్స్ సపోర్ట్‌ ఉంది. అందుకే థియేట‌ర్లు దొరికాయి`` అని కౌంట‌ర్ ఇచ్చారు దిల్‌రాజు. 

 

ఆయ‌న చెప్పిందీ నిజ‌మే.  సినిమాలో ద‌మ్ము ఉంటే... ఎవ్వ‌రూ ఆప‌లేరు. వ‌ద్ద‌న్నా - థియేట‌ర్లు వ‌చ్చి ప‌డిపోతుంటాయి. ఓ ఫ్లాప్ సినిమాలో పెద్ద హీరో న‌టించినంత మాత్రాన‌, జ‌నం లేక‌పోయినా ఆడించుకుంటూ కూర్చోరు క‌దా? చిన్న సినిమాలో విష‌యం ఉంటే.. థియేట‌ర్లు ఇవ్వ‌కుండా ఎవ్వ‌రూ అడ్డుకోలేరు. ఇంత చిన్న లాజిక్కుని నిర్మాత‌లు మిస్ అయిపోతున్నారంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS