ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిన ఈ అందాల తూనీగకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా, టైటిల్ పరంగా 'తూనీగ పాప'గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రియా చక్రవర్తి. ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ బక్కపలచని గ్లామర్‌తో తెగ పిచ్చెక్కించేస్తుంటది.
హాట్ హాట్ బికినీలు, బాత్రూం సొగసులు.. ఇలా ఒక్కటేమిటీ.. ఈ పాపకు అంగాంగ ప్రదర్శన అంటే మితి మీరిన ఇష్టం. పాపం ఏదీ దాచుకోదులెండి. అన్నీ షేర్ చేస్తుంటుంది. అలా తెచ్చుకున్న పాపులారిటీనే చాలా ఎక్కువ అమ్మడికి. ఇకపోతే లేట్ అయినా, లేటెస్ట్‌గా మెగా ఆఫర్ దక్కించుకుందీ తూనీగ పాప.
మెగా అల్లుడు కళ్యాణ్‌దేవ్ నటిస్తున్న తాజా చిత్రంలో రియా చక్రవర్తి హీరోయిన్‌గా ఎంపికైంది. ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న ఈ సినిమాతో రేపో మాపో సందడి చేయనుందీ అందాల భామ. ఇక తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ పిక్ విషయానికి వస్తే, లైట్ బ్లూ కలర్ సమ్మర్ వేర్‌లో హాయిగా చిందేస్తూ కనిపిస్తున్న ఈ ఫోటోకి నెట్టింట్లో మంచి రెస్పాన్స్ వస్తోంది.