తన ప్రతి సినిమాలోనూ మేనమామల రిఫరెన్స్ ఏదో ఒక రూపంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్. తాజాగా 'ఇంటిలిజెంట్' సినిమాలో అయితే అచ్చం మెగాస్టార్ చిరంజీవిని దించేసేలా డాన్సులు, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ని తలపించే అప్పీయరెన్స్ వంటివన్నీ వుండేలా జాగ్రత్తపడ్డాడు.
'ఎంతైనా మెగా మేనల్లుడు కదా, ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయ్. కావాలని తేజూ అవన్నీ చేయడు' అని వినాయక్ చెప్పినా, వాస్తవం ఏంటో 'ఇంటిలిజెంట్' ట్రైలర్ చూస్తే అర్థమయిపోతుంది. మావయ్యల్ని వాడేసుకోవడం తేజు హక్కు కావొచ్చునేమో. కానీ ఈ వాడకంతోనే నెట్టుకొచ్చేస్తానంటే కుదరదు. గత నాలుగు సినిమాలూ ఫెయిల్ అయ్యాయని తేజూనే స్వయంగా ఒప్పుకున్నాడు. అందుకే ఇప్పుడు 'ఇంటిలిజెంట్'తో తేజు కొత్తగా ట్రై చేసి తీరాల్సిందే. వినాయక్ అంటే మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ని తెరకెక్కించడంలో దిట్ట. కాబట్టి ఈసారి తనకు కమర్షియల్ హిట్ పక్కాగా దొరుకుతుందనే నమ్మకంతో ఉన్నాడు తేజూ.
సాంగ్ ప్రోమోస్‌లో తేజూ డాన్సులు, ఆ పాటల్లో తేజూ సరసన నటించిన అందాల భామ లావణ్య త్రిపాటి గ్లామర్ సొగసులు బాగానే హైలైట్ అవుతున్నాయి. అవన్నీ అలా ఉంచితే తేజూ, ఒకింత సన్నబడాల్సిందేననే అభిప్రాయాలు సర్వత్రా విన్పిస్తున్నాయి 'ఇంటిలిజెంట్' ట్రైలర్ వచ్చిన తర్వాత. ఈ అభిప్రాయాల నేపథ్యంలో ముందు ముందు చేయబోయే సినిమాల్లో తేజూ స్లిమ్‌గా కన్పిస్తాడేమోగానీ, ఇకపై తేజు కెరీర్ పరంగా కూడా గేర్ మార్చాల్సిన తరుణం వచ్చేసింది.
'ఇంటిలిజెంట్' సినిమాతో కమర్షియల్ సక్సెస్ వస్తుందనీ, కొద్దనం కోసం తన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయనీ తేజు చెబుతున్న మాటలే నిజమవుతాయేమో చూద్దాం.