చిరంజీవి పక్కన, చిరుతో సమానంగా డాన్స్ చేయగలిగే కథానాయికల్లో రోజా పేరు తప్పకుండా ఉంటుంది. ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, బిగ్ బాస్ సినిమాల్లో.. వీళ్ల జోడీ అభిమానుల్ని అలరించింది. అయితే...ఆ తరవాత ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రత్యర్థులుగా మారారు. రాజకీయ పరంగా.. చిరుని వ్యతిరేకిస్తూ.. చాలాసార్లు మాట్లాడింది రోజా. ఇప్పటికీ పవన్ గురించి సెటైర్లు పేలుస్తూనే ఉంటుంది. అందుకే రోజా అంటే మెగా ఫ్యాన్స్ కి కొంత కినుక. కానీ.. ఓ హీరోగా, మెగా స్టార్ గా చిరుని ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటుంది రోజా. అందుకు మరో నిదర్శనం ఇది.
చిరుతో నటించాలనివుంది అంటూ... ఓ టీవీ ఛానల్ లో తన మనసులోని మాట బయటపెట్టింది రోజా. ''నేను సినిమాలు మానేసి, రాజకీయాలతో బిజీగా ఉంటున్నా. అయినప్పటికీ.. చిరు, నాగార్జునలతో నటించే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తా' అంది. అంతేకాదు... ''చిరుతో సమానంగా స్టెప్పులు వేసే ఒకరిద్దరు హీరోయిన్లలో నువ్వు ఉంటావు... అని సురేఖ ఓసారి కాంప్లిమెంట్ ఇచ్చారు. అది.. నా జీవితంలో మర్చిపోలేను'' అని చెప్పుకొచ్చింది రోజా. సో.. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఈ విషయాన్ని మెగాఫ్యాన్స్ కూడా గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది.