సంక్రాంతి సినిమాల‌కు డేంజ‌ర్ బెల్‌.

మరిన్ని వార్తలు

ప్ర‌తీ సంక్రాంతి పండ‌క్కీ కొత్త సినిమాల జాత‌ర కన‌ప‌డుతూనే ఉంటుంది. గ‌త నాలుగైదు ఏళ్ల‌లో తెలుగు నాట సంక్రాంతి హ‌డావుడి రెట్టింపు అవుతూనే ఉంది. 2020లోనూ ఏకంగా నాలుగు సినిమాలు ఢీ కొట్టాయి. ఒక రోజు వ్య‌వ‌ధిలోనే రెండు పెద్ద సినిమాలు విడుద‌ల‌య్యాయి. నువ్వా? నేనా అన్న‌ట్టు పోటీ ప‌డి, రికార్డులు పంచుకెళ్లాయి. అయితే 2021లో మాత్రం ఈ హంగామా త‌గ్గే అవ‌కాశం ఉంది. ఎందుకంటే `ఆర్‌.ఆర్‌.ఆర్‌` ఈ సంక్రాంతికే వ‌స్తోంది. జ‌న‌వ‌రి 8న `ఆర్‌.ఆర్‌.ఆర్‌` వ‌స్తున్న‌ట్టు రాజ‌మౌళి ప్ర‌క‌టించేశాడు.

 

రాజ‌మౌళి సినిమాకి ఎదురెళ్ల‌డం అంటే కొండ‌ని ఢీ కొట్ట‌డ‌మే. అదో డైనోస‌ర్‌. బాహుబలి స‌మ‌యంలో ఆ సినిమాకి పోటీ నిల‌వ‌డానికి ఏ ఒక్క‌రూ ధైర్యం చేయ‌లేదు. బాహుబ‌లి విడుద‌ల‌కు ముందు 15 రోజులు, ఆ త‌ర‌వాత 15 రోజులూ.. కొత్త సినిమాలేవీ క‌నిపించ‌లేదు. ప్ర‌తీ థియేట‌ర్లోనూ బాహుబ‌లి మాత్ర‌మే క‌నిపించింది. దానికి త‌గ్గ‌ట్టుగా క్లీన్ స్వీ ప్ చేసుకుంటూ వెళ్లింది. స‌రిగ్గా 2021లోనూ ఇదే సీన్ రిపీట్ అవ్వ‌బోతోంది. రాజ‌మౌళి సినిమా, అందులోనూ మ‌ల్టీస్టార‌ర్‌. అందుకే... ఈ సినిమాకి పోటీ నిల‌వ‌డానికి ఎవ్వ‌రికీ ధైర్యం ఉండ‌క‌పోవొచ్చు. సంక్రాంతికి రావాల‌నుకున్న మిగిలిన సినిమాలు డ్రాప్ అయ్యే ఛాన్సుంది. పెద్ద స్టార్లెవ‌రూ అంత ధైర్యం చేయ‌క‌పోవొచ్చు. ఇక చిన్న సినిమాల సంగ‌తి స‌రే స‌రి. మ‌హా అయితే సంక్రాంతి సీజ‌న్‌లో మ‌రో సినిమా వ‌స్తుందేమో. రాబోయే సంక్రాంతి అంతా `ఆర్‌.ఆర్‌.ఆర్‌`దే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS