ఆర్.ఆర్.ఆర్ సినిమా వాయిదా పడడం అందరినీ షాక్ లో ముంచెత్తింది. ఈసినిమా ఈ సంక్రాంతికి రాకపోవడం అభిమానులను ఎంతగా నిరాశ పరుస్తోందో, ఊహించుకోవచ్చు. అయితే నిర్మాతని అంతగా ఇబ్బంది పెడుతోంది. ఈ సినిమాని మరోసారి వాయిదా వేయడంతో పంపిణీదారులు అసంతృప్తితో ఉన్నారు. నిర్మాత డివివి దానయ్యపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొస్తున్నట్టు ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.
ఈ సినిమాకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని ఏరియాల రేట్లు ఆల్రెడీ హాట్ కేకుల్లా అమ్ముడు అయిపోయాయి. యేడాది క్రితమే.. బయ్యర్లు అడ్వాన్సులు ఇచ్చేశారు. అప్పటి నుంచీ ఈసినిమా వాయిదా పడుతూ వస్తోంది. పెద్ద సినిమా కదా, ఎప్పుడొచ్చినా లాభాలు సంపాదించొచ్చు అని బయ్యర్లు ధీమాగా ఉండేవారు. కానీ... వాయిదాల పరంపర ఇలానే కొనసాగడంతో వాళ్లకీ చిరాకు వచ్చింది. `మాకు మీ సినిమా వద్దు.. మా డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయండి` అని కొంతమంది నిర్మాత దానయ్యపై ఒత్తిడి తీసుకొస్తున్నార్ట. ఇప్పటికే చాలా రేట్లు పెట్టి సినిమాని కొన్నామని, వాటికి వడ్డీలు కట్టలేక మునిగిపోతున్నామని, సినిమా ఎప్పుడొచ్చినా, లాభాలు రావడం కల అని, అందుకే ఈ సినిమాని వదిలించుకోవాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకరిద్దరు బయ్యర్లు ఒత్తిడికి గురి చేసినా ఫర్వాలేదు. తట్టుకోవచ్చు. మొత్తమంతా ఇదే మాట మీద వస్తే... దానయ్య ఆ డబ్బుల్ని తిరిగి కట్టడం చాలా కష్టం. అందుకే డబ్బులు ఇవ్వమంటున్న బయ్యర్లతో బేరాలు మొదలెట్టార్ట. రేటు తగ్గిస్తామని, దాంతో వడ్డీ భారం తగ్గుతుందని చెబుతున్నార్ట. మరి ఈ మాటలకు బయ్యర్లు శాంతిస్తారో లేదో?