'ఆర్ఆర్ఆర్' షూటింగ్ అప్ డేట్!

మరిన్ని వార్తలు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. కాగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ లోని ఫైట్ సీన్స్ ను షూట్ చేస్తోన్నట్లు.. అయితే ఎన్టీఆర్ రేపటి నుండి షూట్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తతం రామ్ చరణ్ పై యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన సీన్స్ ను తీస్తున్నారు.

 

ఈ సన్నివేశాల్లో రామ్ చరణ్ ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయట. అలాగే రేపటి నుండి ఎన్టీఆర్ - చరణ్ పై షూట్ చేస్తారట. ఇవి మరో నాలుగు రోజులు దాకా పడతాయట. అయితే ఎన్టీఆర్ చెయ్యబోయే సన్నివేశాల్లో ఎన్టీఆర్ రఫ్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక 'బాహుబలి' తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS