ఇప్పుడు అందరి దృష్టీ ఆర్.ఆర్.ఆర్‌పైనే ఉంది. ఈనెల 25న ఆర్.ఆర్.ఆర్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. తొలి రోజు దేశ వ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని విశ్లేషకులు ముందే ఓ అంచనాకు వచ్చేశారు. అయితే ఆ హోరు ఎన్ని రోజులు కొనసాగుతుందన్నదే కీలకం. రామ్ చరణ్, ఎన్టీఆర్‌ని రాజమౌళి ఎలా బాలెన్స్ చేశాడు, ఇద్దరిలో ఎవరి స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత? ఎవరి పాత్ర పై చేయి సాధిస్తుంది? ఎవరు ముందుగా ఎంట్రీ ఇస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలు.
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ కాస్త ఆలస్యం కాబోతోందని టాక్. ఎన్టీఆర్ కంటే చరణే ముందు ఎంట్రీ ఇస్తాడట. ఆ తరవాతే ఎన్టీఆర్ వస్తాడట. కానీ రెండు ఎంట్రీల మధ్య గ్యాప్ తక్కువే అని తెలుస్తోంది. ఎన్టీఆర్, చరణ్ తొలిసారి కలుసుకునే సన్నివేశాలు హై ఓల్టేజీలో సాగుతాయని, ఆసీన్ ఈ సినిమాకే పెద్ హైలెట్ అని తెలుస్తోంది. ఇంట్రవెల్ ఎపిసోడ్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారట. ఆ స్థాయిలో ఆ ఎపిసోడ్ ఉండబోతోందని తెలుస్తోంది. క్లైమాక్స్ కూడా.. సూపర్బ్ గా వచ్చిందట. ఈ సినిమాలో ప్రతీ పావు గంటకూ ఓ హై ఉండేలా రాజమౌళి జాగ్రత్త పడ్డాడని తెలుస్తోంది. మొత్తానికి ఫ్యాన్స్‌కి పూనకాలే.