అగ్ర హీరోలతో సినిమా అంటే నిర్మాతలకు పండగే. కొబ్బరికాయ కొట్టగానే బిజినెస్ మొదలైపోతుంది. టీజర్ రాకముందే.. అన్ని ఏరియాలూ అమ్ముడైపోతాయి. అయితే రూలర్ పరిస్థితి పూర్తిగా రివర్స్ లో ఉంది. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. 20న విడుదల కాబోతోంది. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ మొదలవ్వలేదు. ఎన్టీఆర్ బయోపిక్‌ల దెబ్బతో ఏ బయ్యరూ ఈ సినిమా కొనడానికి ముందుకు రావడం లేదు. దాంతో అన్ని ఏరియాల్లోనూ సొంతంగా విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నాడు. అడ్వాన్సులు తీసుకుని సినిమా ఇచ్చేస్తున్నారు.
డబ్బులు వస్తే సరే సరి. లేదంటే ఇచ్చిన అడ్వాన్సుల్ని కూడా తిరిగి కట్టాల్సిందే. రూలర్ ట్రైలర్ ఆదివారమే విడుదలైంది. ట్రైలర్ మాసీగానే ఉన్నా, ఆకట్టుకునే అంశాలేవీ ఇందులో కనిపించడం లేదు. అందుకే... బయ్యర్లెవరూ ఈ సినిమా కొనడానికి ఆసక్తి చూపించడం లేదు. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. అడ్వాన్సుల రూపంలో కనీసం 15 కోట్లు కూడా రాలేదు. అలా ఉంది రూలర్ పరిస్థితి.